ప్రొఫెసర్లు మురళీమనోహర్, పీఎల్ విశ్వేశ్వర్‌రావు
హైదరాబాద్, నవంబర్ 1౧ (విజయక్రాంతి): కులగణనను వ్యతిరేకించే వాళ్లు దేశ ద్రోహులేనని ప్రొఫెసర్ మురళి మనోహర్ మండిపడ్డారు. సోమవారం గాంధీభవన్‌లో ఆయన మీడియా తో మాట్లాడుతూ.. బీజేపీ గత పదేళ్లు అధికారంలో ఉండి కూడా అనేక వృత్తులపై ఎందుకు అధ్యయనం చేయలేదని ప్రశ్నించారు. ఏ గణాంకాల ఆధారంతో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు చట్టంగా రూపొందించారో మోదీ చెప్పలేదని అన్నారు.
విద్యా కమిషన్ సభ్యులు ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వర్‌రావు మాట్లాడుతూ.. కుల గణనపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించే హక్కు ఎవరికీ లేదన్నారు. త్వరలో రౌండ్‌టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. అభివృద్ధి పలాలు అందరికీ అందాలంటే కులగణన అవసరమని ప్రొఫెసర్ సమ్మయ్య అన్నారు. కులగణ నను అడ్డుకోవడమంటే దేశ అభివృద్ధిని అడ్డుకోవడమేనని ప్రొఫెసర్ సింహాద్రి పేర్కొన్నారు.