calender_icon.png 3 February, 2025 | 2:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భంగం కలిగించే వాఖ్యలు చేసినవారు రాష్ట్రపతికి క్షమాపణ చెప్పాలి

02-02-2025 11:26:21 PM

బిజెపి మండల అధ్యక్షుడు నూపా రమేష్... 

చర్ల (విజయక్రాంతి): చర్ల మండల కార్యాలయం బీజేపీ జిల్లా కౌన్సిల్ మెంబర్ బాబా పాహీం అధ్యక్షతన ఆదివారం జరిగిన సమావేశంలో చర్ల మండల బీజేపీ అధ్యక్షులు నూప రమేష్ మాట్లాడుతూ.. భారత పార్లమెంట్ లో ప్రసంగించిన రాష్ట్రపతి గౌ.శ్రీమతి ద్రౌపది ముర్ము, కాంగ్రెస్ అధినాయకురాలు సోనియా, పూర్ లేడీ అని, తనయుడు రాహుల్ బోరింగ్ స్పీచ్ అని అవమానించడం, దౌర్భాగ్యం, పార్టీలు వేరైనా, వారు ఈ దేశానికి ప్రథమ పౌరురాలు వారిని గౌరవించడం అందరి బాధ్యత అన్నారు. అటువంటిది బాధ్యత గల భారత పార్లమెంట్ సభ్యులు అయి ఉండి అలా వ్యాఖ్యానించడం వారికి ఈ దేశ సర్వోన్నత స్థానంపై ఎంత గౌరవం ఉందో అర్థమవుతుంది.

అయినా వారి పార్టీ రాష్ట్రపతి, ప్రధానులనే అవమానించిన వారికి ఇది పెద్దవిషయం కాదు కానీ ఆ పార్టీలో ఉన్న గిరిజన నాయకులు, కార్యకర్తలు ఆలోచించాలి? జరుగుతున్న ఎన్నికల్లో పరాజయం వారికి అసహనం కలిగించవచ్చు కానీ వారి అసహనం దేశ సార్వభౌమత్వం పైన చూపించడం దేశాన్ని అగౌరవ పరచడమే, ఇప్పటికే పలుమార్లు విదేశాలలో దేశప్రతిష్టకు భంగం కలిగించే వాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ, సోనియాలు దేశప్రజలకు క్షమాపణ చెప్పాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ యొక్క కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు ముత్తారపు రత్తయ్య సాదం లోకనాథం గూనూరి రమణ  బంద మధు ముత్తారపు శ్రీనివాస చారి ఇర్ఫా సుబ్బారావు కుప్ప మాధవరావు సండ్రుగొండ వెంకటేశ్వరరావు బొల్లె నాగరాజు విశ్వనాధం తదితరులు పాల్గొన్నారు.