వంగర పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన దీక్ష చేస్తున్న దంపతులు
- తల్లిదండ్రుల డిమాండ్
- 29 రోజులుగా వంగర పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన దీక్ష
భీమదేవరపల్లి, నవంబర్14: తమ కుమారుడిని హత్య చేసిన వారిని అరెస్టు చేసి శిక్షించాలని కోరుతూ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ ఎదుట 29 రోజులుగా నిరసన దీక్ష చేస్తున్నారు. అయినా కూడా పోలీసులు స్పందించకపోవడం గమనార్హం. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం రంగ య్యపల్లి గ్రామానికి చెందిన ఆషాడపు దశరథం దంపతుల కుమారుడు ఆషాడపు రాజేశ్ 29 మే 2018లో గ్రామంలో జరిగిన పెళ్లి ఊరేగింపులో అకస్మాత్తుగా మృతిచెందాడు.
అదే గ్రామానికి చెందిన తొమ్మిది మంది యువకులు కూల్‌డ్రింక్‌లో విషం కలిపి తన కుమారుడిని హత్య చేశారని తల్లిదండ్రులు ఆరోపించారు. డాక్టర్లు ఇచ్చిన పోస్టుమార్టం రిపోర్టులో కూడా విషప్రయో గం జరిగినట్లు ధ్రువీకరించారని పత్రాలను మీడియాకు చూపించారు.
తన కుమారుడి హత్యకు కారణమైన వారిని అరెస్టు చేసి న్యా యం చేయాలని గత 29 రోజులుగా వంగర పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన దీక్ష చేస్తున్నారు. అయినా పోలీసులు పట్టించుకోవ డం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం జరిగేంత వరకు దీక్ష విరమించబోమని వారు స్పష్టం చేశారు.