బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి
హైదరాబాద్, ఫిబ్రవరి 1 (విజయక్రాంతి): కేంద్ర బడ్జెట్‌ను వ్యతిరేకించే వారు, పద్దులో లోపాలు వెతికేవారు దేశ వ్యతిరేకులని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్‌ను విమర్శిస్తున్న వారిని టార్గెట్ చేస్తూ శనివారం ఆయన స్పందించారు.
పేదలు, యువతీ యువకులు, రైతులు, మహిళలకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చిందని, వారిని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్‌కు రూపకల్పన చేసిందని కొనియాడారు. వ్యవసాయ రంగాన్ని పరిపుష్టం చేసే విధంగా బడ్జెట్ ఉందన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయని వెల్లడించారు. తద్వారా నిరుద్యోగ సమస్య తగ్గుతుందని అభిప్రాయపడ్డారు.