21-04-2025 12:02:36 AM
ఖమ్మం లో బిజేపి ఆధ్వర్యంలో రాస్తారోకో
ఖమ్మం, ఏప్రిల్ 20(విజయక్రాంతి ):-తప్పు చేసిన వారికి ఎప్పటికైనా శిక్ష తప్పదని, నేషనల్ హెరాల్ పత్రిక పేరుతో కాంగ్రెస్ పార్టీ భారీ కుంభ కోణానికి పాల్పడిరదని, రూ.90 కోట్ల పెట్టుబడి పెట్టి, వేల కోట్ల ఆస్తులను దోచుకుంటుంటే న్యాయవ్యవస్థ చూస్తూ ఊర్కుంటుందా?, అందుకే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ జరుపుతుందని బిజెపి ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు పేర్కొన్నారు.
ఈ కుంభకోణంలో కాంగ్రెస్ అధినాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలే కాదు ఇంకెవరున్నా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని, తప్పు చేసిన వారికి కచ్చితంగా శిక్ష పడుతుందని స్పష్టం చేశారు. నేషనల్ హెరాల్ కేసులో సోనియా, రాహుల్ పేర్లు రావడం పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ మాజీ ఎంపీలు అంజన్ కుమార్, అద్దంకి దయాకర్ల తీరుకు నిరసనగా ఆదివారం బిజెపి ఆధ్వర్యంలో హోటల్ మినార్ గ్రాండ్ నుండి కృషి భవన్ కూడలి వరకు ర్యాలీగా వచ్చి పార్టీ శ్రేణులతో కలిసి ఆయన రాస్తారోకో నిర్వహించారు.
ఈ సందర్భంగా నెల్లూరి కోటేశ్వరరావు మాట్లాడుతూ నేషనల్ హెరాల్ కేసులో మనీలాండరింగ్ జరిగిందని, రూ.90 లక్షలు పెట్టుబడి పెట్టి, వేల కోట్లు ఎలా దోచుకుంటారని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్కు నిరసన సెగ తగలక తప్పదని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకురాలు, హైకోర్టు అడ్వకేట్ మౌనిక సుంకర, రాష్ట్ర కార్యదర్శి ఎం.శ్రీనివాస్గౌడ్, పాలేరు, సత్తుపల్లి, మధిర నియోజకవర్గాల ఎమ్మెల్యే అభ్యర్థులు నున్నా రవి కుమార్, నంబూరి రామలింగేశ్వరరావు, విజయరాజు, కన్వీనర్ ఇవి.రమేష్, కోౠకన్వీనర్లు వీరవెల్లి రాజేష్ గుప్తా, కొలిపాక శ్రీదేవి, ఎస్కె.యాకూబ్ పాషా, పమ్మి అనిత తదితరులు పాల్గొన్నారు.