calender_icon.png 25 September, 2024 | 5:59 PM

అమ్మానాన్నలకు బంధువులు లేనిపోనివి నూరిపోశారు

24-09-2024 02:00:21 AM

చిత్ర పరిశ్రమలో ఎవరికి ఎప్పుడు అదష్టం కలిసొస్తుందో ఎవరికీ తెలియదు, ఒక్క ఛాన్స్ చాలు ఓవర్‌నైట్ స్టార్ అయిపోవడానికి! ఈ కోవలోకే వస్తుంది బాలీవుడ్ హాట్ బ్యూటీ త్రిప్తి డిమ్రి. ‘యానిమల్’లో బెడ్‌రూమ్ సీన్స్ ఈ వయ్యారికి మంచి పేరు తీసుకొచ్చాయి. అదే స్థాయిలో విమర్శలు కూడా ఎదుర్కొవాల్సి వచ్చింది. ప్రస్తుతం ‘విక్కి విద్యా కా వో వాలా వీడియో’, ‘భూల్ భూలాయా 3’, ‘ధడక్’లలో నటిస్తున్న త్రిప్తి.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ చేసిన ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర విశేషాలు పంచుకుంది.

“ఇండస్ట్రీలోకి వెళ్తానంటే ఇంట్లో వాళ్లు కంగారుపడ్డారు. కానీ నేనే ధైర్యం చేసి ముంబైకి వచ్చా. ఇక్కడ ఒకే గదిలో దాదాపు 50 మందితో కలిసి నివసించా. ప్రతిరోజూ అవకాశాల కోసం ప్రయత్నించా. తల్లిదండ్రులు గుర్తుకు వచ్చినా, వాళ్లవద్దకు తిగిరి వెళ్లకూడదని కష్టాలు, బాధలను భరించా. ఈ సమయంలో బంధువులు, స్థానికులు రాబందుల్లా పేరెంట్స్ కు లేనిపోనివి చెప్పారు. నాకు పెళ్లి కాదని, ఎవరూ ముందుకు రారని నూరిపోశారు” అని త్రిప్తి చెప్పారు. ఇంటర్వ్యూ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు త్రిప్తిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.