calender_icon.png 11 March, 2025 | 4:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీస్‌స్టేషన్‌కు వచ్చేవారికి సత్వర న్యాయం చేయాలి

11-03-2025 12:30:45 AM

  • పోలీసుల సంక్షేమానికి కృషి చేస్తా మహిళలు, చిన్నారుల రక్షణకు ప్రత్యేక చర్యలు 
  • రౌడీ షీటర్లు, క్రిమినల్స్ పై ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్ 

సంగారెడ్డి, మార్చి 10 (విజయ క్రాంతి): పోలీస్ స్టేషన్కు వచ్చి బాధితులకు సత్వర న్యాయం చేసేందుకు పోలీస్ అధికారులు కృషి చేయాలని సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. సోమవారం సంగారెడ్డి జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీగా బాధ్యతలు స్వీకరించి పోలీస్ అధికారులకు పలు సూచనలు చేశారు. సంగారెడ్డి జిల్లా నూతన ఎస్పీ గా భాద్యతలు స్వీకరించిన పరితోష్ పంకజ్  పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.

2020 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారి.  స్వస్థలం ఆరా పట్టణం,  బోజ్పూర్ జిల్లా, బీహార్ రాష్ట్రం. గతంలో భద్రాచలం అదనపు.ఎస్పీ గా, భద్రాద్రి కొత్తగూడెం ఓ.యస్.డి గా భాద్యతలు నిర్వహించారు.  జిల్లా పోలీసు అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో  అధికారులు, సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ.. డ్యూటి పరంగా, పర్సనల్ గా ఎలాంటి సమస్యలున్నా నేరుగా నా దృష్టికి తీసుకురాలని, సిబ్బంది సంక్షేమానికి కట్టుబడి ఉంటానని అన్నారు.

తమకు కేటాయించిన విధులను సక్రమంగా, నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని సూచించారు. స్టేషన్ కు వచ్చిన ఫిర్యాదిదారులతో మర్యాదగా మాట్లాడాలని, వారి సమస్యను ఓపిగ్గా విని సత్వర న్యాయం జరిగేలా చూడాలని అన్నారు. సివిల్ తగాదాలలో తల దూర్చకూడదని, చట్టానికి అనుగూణంగా నడుచుకోవాలని అధికారులకు సూచించారు. 

శాంతి భద్రతల రక్షణలో 24*7 జిల్లా ప్రజలకు అందుబాటులో ఉండటం జరుగుతుందని, ముఖ్యంగా మహిళలు, చిన్నారుల భద్రత విషయమై కఠినంగా వ్యవహరించడం జరుగుతుందన్నారు. జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అల్లరి మూకలపై ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుం దని అన్నారు. జిల్లాలో క్రిమినల్, యం.ఓ నేరస్తుల కదళికల పై ప్రత్యేక నిఘా ఉంచి, కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎ. సంజీవ రావ్, ఎ.ఓ ఇ. కళ్యాణి,  డియస్పీ లు రవీందర్ రెడ్డి, సత్యయ్య గౌడ్, రామ్ మోహన్ రెడ్డి, వెంకట రెడ్డి, సురేందర్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, ఎఆర్ డియస్పీ నరేందర్, జిల్లా  ఇన్‌స్పెక్టర్, సబ్‌ఇన్‌స్పెక్టర్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

జిల్లా కలెక్టర్ ను కలిసిన ఎస్పి 

సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు కొత్త ఎస్పీ పంకజ్ మర్యాద పూర్వకంగా చేశారు. కలెక్టర్ కార్యాలయంలో కలిసి జిల్లా పరిషత్‌పై చర్చించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవాని చంద్రను కలిశారు.