calender_icon.png 12 March, 2025 | 9:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేవాలయాలపై దాడులు చేసే వారిని కఠినంగా శిక్షించాలి

11-03-2025 04:27:41 PM

మేడ్చల్ (విజయక్రాంతి): దేవాలయాలపై దాడులు, చోరీలు చేసేవారిని కఠినంగా శిక్షించాలని బిజెపి నాయకురాలు బచ్చు కృష్ణప్రియ మల్లారెడ్డి డిమాండ్ చేశారు. కుత్బుల్లాపూర్ లోని గాంధీ నగర్ లో శివాలయంలో దొంగలు శివలింగం పైకి ఎక్కి హిందువుల మనోభావాలు దెబ్బ తీశారు అన్నారు. ఇలాంటి వారికి కఠిన శిక్ష విధించాలన్నారు. ఇటీవల కాలంలో హిందూ దేవాలయాల్లో దొంగతనాలు పెరిగిపోయాయని అన్నారు. దేవాలయాల వద్ద నిఘా ఏర్పాటు చేయాలన్నారు.