14-04-2025 12:05:46 AM
దశాబ్దాల పాటు ఐజేయూలో పని చేసిన.. గుర్తుపట్టని స్థితిలో అధ్యక్ష, కార్యదర్శులు
సీనియర్ జర్నలిస్టులు, టీయూడబ్ల్యూజే (ఐజేయు)కి రాజీనామ చేసిన రఘుపతి, గణేష్
మహేశ్వరం, ఏప్రిల్ 13: జర్నలిస్టుల సమస్యలు, జర్నలిస్టు సంఘాల గురించి కనీసం అవగాహన లేని వ్యక్తులు టీయూడబ్ల్యూజే (ఐజేయూ) సంఘం రంగారెడ్డి జిల్లా కమిటీ అధ్యక్ష, కార్యదర్యులుగా చెలమణి అవుతూ.... జర్నలిస్టు సంఘాల పట్ల ఆనారోచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని సీనియర్ జర్నలిస్టులు, టీయూడబ్ల్యూజే (ఐజేయు) ఇటీవల రాజీనామ చేసిన రఘుపతి, గణేష్ తదితరులు తీవ్రంగా ఖండించారు.
ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. టీయూడబ్ల్యూకే (ఐజేయూ) రంగారెడ్డి జిల్లా అధ్యక్ష, కార్యదర్యులుగా తామేనని చెప్పుకుంటున్న వ్యక్తులు తమపై చేసిన వాఖ్యలతో... జర్నలిస్టు సంఘాలతో వారికున్న సంబంధాలు యేపాటివో స్పష్టమైందన్నారు. జిల్లా అధ్యక్ష స్థాయికి చేరుకున్న వ్యక్తి ఒకసారి గత కమిటీ నాయకుల వివరాలను ఇప్పటికైనా సంఘం కార్యాలయం నుంచి తెప్పించుకొని చూసుకోవాలని గుర్తు చేశారు.
పెద్దల మెప్పుతో వడవి పొందిన వారికి సంఘంలోని సభ్యులు, కమిటీలో పనిచేసిన వారు ఎలా తెలుస్తారని విమర్శించారు. వ్యవస్థగా నడవాల్సిన సంఘం ఒకరిద్దరు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిందనే ఆవేదనతోనే జర్నలిస్టులంతా ఆ సంఘానికి దూరమవుతున్నారని, భవిష్యత్తులో ఇంకా చాలా మంది దూరమయ్యే అవకాశం ఉందన్నారు.
ఎలాగోలా అధ్యక్ష పదవిలోకి వచ్చి నెలరోజులు పూర్తి చేసుకున్న మిమ్మల్ని ఇప్పటికైనా యూనియన్ ఆఫీసు మెట్లు ఎక్కనించారా..? ఒకసారి చెక్ చేసుకోవాలని హితువు పలికారు. యూనియన్ కార్యాలయంలోకి గనక నిన్ను రానిస్తే... ఒకసారి రంగారెడ్డి జిల్లా పాత కమిటీల నియామకం, జిల్లాలోని మండలాల కమిటీల ఎంపిక తీరు, అందులోని సభ్యుల వివరాలు, ఇటీవల సంఘాన్ని వదిలిన వారు యూనియన్ పిలుపుమేరకు చేసిన పోరాటాల వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయాలని సూచించారు. మేమంతా రోడ్లపై ధర్నాలు చేసేటప్పుడు మీరెకుడున్నారో ఒకసారి గుర్తు తెచ్చుకుంటే అంతా మీకే అర్థమవుతుందని హితువుపలికారు. మీరు చేసిన వ్యాఖ్యలే సంఘంపై అవగాహన లేనిది ఎవ్వరికో జర్నలిస్టు లోకానికి అర్ధమవుతుందని గుర్తు చేశారు.