కాప్రా (విజయక్రాంతి): అర్హులైన వారు సీఎం రిలీఫ్ ఫండ్ ను సద్వినియోగం చేసుకోవాలని చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి పేర్కొన్నారు. చర్లపల్లి డివిజన్ విద్యా మారుతి నగర్ కు చెందిన కనకదుర్గ అనారోగ్యం గురై వైద్యశాలలో చికిత్స పొంది ఇంటికి వచ్చిన ఆమెకు కార్పొరేటర్ బొంతు శ్రీదేవి 40 వేల సీఎం రిలీఫ్ ఫండ్స్ చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని ఆమె కోరారు. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ నాగిళ్ళ బాల్రెడ్డి, నాయకులు బుడిగే ప్రభు గౌడ్, బత్తుల శ్రీకాంత్ యాదవ్, వెంకటరెడ్డి లతో పాటు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.