బదిలీల్లో వేర్వేరుగా రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలు
ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ
హైదరాబాద్, జూలై 12 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉద్యోగుల సాధారణ బదిలీల్లో భాగంగా రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలను వేర్వేరు స్టేషన్లుగా చూపించాలని ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రెండు జిల్లాలను జీహెచ్‌ఎంసీలో అంతర్భాగం కాకుండా వేరు గా చూపించాలని ఆదేశాలిచ్చింది. దీంతో అక్కడి వారు ఇక్కడికి, ఇక్కడి వారు అక్కడికి బదిలీ అయ్యే అవకాశం దొరికింది. గతంలో జీహెచ్‌ఎంసీతో పాటు, రంగారెడ్డి, మేడ్చల్ మల్కా జిగిరి జిల్లాలను బదిలీల కోసం ఒకే స్టేషన్‌గా చూపించేవారు. దీంతో ఈ జిల్లాల్లోని వారంతా మెదక్, వికారాబాద్ సహా పలు జిల్లాలకు బదిలీలు కావాల్సి వచ్చేది. అయితే, దీనిపై తెలంగాణ గెజిటెడ్ అధికారుల సం ఘం (టీజీవో) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఏలూరి శ్రీనివాస్ రావు, ఏనుగుల సత్యనారాయణలు ఇటీవల సీఎస్‌ను కలిసి నిబంధనను మార్చాలని కోరారు. ఈ నేపథ్యంలో స్పందించిన సీఎస్ వేర్వేరు స్టేషన్లుగా పరిగణలోకి తీసుకోవాలని నిర్ణయించారు.