calender_icon.png 17 November, 2024 | 8:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళలను కించపరచడంలో ‘ఆ ఇద్దరూ’ ఒక్కటే

15-09-2024 01:32:58 AM

విప్ ఆది శ్రీనివాస్ 

హైదరాబాద్, సెప్టెంబర్ 14 (విజయక్రాంతి): మహిళలను కించపరిచిన కౌశిక్‌రెడ్డిని అభినందించడానికే బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ ఆయన ఇంటికి వెళ్లారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆరోపించారు. ఎమ్మెల్యేలకు చీర, గాజులు పంపుతానని మహిళలను అవమానించిందుకే కౌశిక్‌రెడ్డిని కేటీఆర్ ఆలింగనం చేసుకున్నారని ఆయ న ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపులపై బీఆర్‌ఎస్‌కు మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. 2019లో పీఏసీ చైర్మన్ పదవిని ప్రతిపక్ష కాంగ్రెస్‌కు కాకుండా ఎంఐఎంకు ఇచ్చిన విషయాన్ని మర్చిపోవద్దన్నారు.

శనివారం ఆయన  సీఎ ల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు  మేడిపల్లి సత్యం, భూపతిరెడ్డిలో కలిసి  మీడియాతో మాట్లాడుతూ.. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా కల్లు తాగిన కోతిలా కౌశిక్‌రెడ్డి  చిందులేస్తున్నందుకు కేటీఆర్ సత్కారం చేశారన్నారు. మహిళలను అవమానించడం, పోలీసులను బెదిరించడంలో కేటీఆర్, కౌశిక్‌రెడ్డిలిద్దరూ ఒక్కటేనని విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.

సెటిలర్స్‌ను అవమానించినందుకు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. పదేండ్లు బీఆర్‌ఎస్‌కు ప్రజలు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరిలా చేశారన్నారు. వ్యవసాయా న్ని గాలికి వదిలేసి రైతులు ఆత్మహత్యలకు కారణమయ్యారని, ప్రాజెక్టుల్లో రూ.వేల కోట్ల కమీషన్లు దండుకున్నారని ఆరోపించారు.