calender_icon.png 16 January, 2025 | 10:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆ ట్యూన్స్ పుష్ప3లో..

16-01-2025 01:51:32 AM

అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప2’ రికార్డుల మీద రికార్డులు కొల్లగొట్టింది. ఈ నేపథ్యంలో ‘పుష్ప ది ర్యాంపేజ్’పై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. తాజాగా ఈ చిత్ర సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ పార్ట్ 3 గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘పుష్ప 3’ స్టోరీపై రీ వర్క్ జరుగుతోందని వెల్లడించారు. ‘పుష్ప3’ విషయంలో మీపై ఒత్తిడి ఉందా? అని ప్రశ్నకు సమాధానంగా దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ.. “వృత్తిపరమైన టెన్షన్ నాకెప్పుడూ ఉండదు.

ఒత్తిడి ఉంటే క్రియేటివిటీకి ఆస్కారముండదు. ‘పుష్ప2’కి ది బెస్ట్ ఇవ్వాలని నేను, సుకుమార్, చంద్రబోస్ కలిసికట్టుగా పని చేశాం. పుష్ప 1, పుష్ప 2 కోసం ఎలా అయితే పని చేశామో సీక్వెల్ కోసం కూడా అలాగే పని చేస్తాం. ‘పుష్ప2’ కోసం వినియోగించలేకపోయిన కొన్ని ట్యూన్స్‌ను ‘పుష్ప3’లో వినియోగించే అవకాశం ఉండొచ్చు” అని తెలిపారు. అయితే ఈ సినిమా పట్టాలెక్కేందుకు కొంత సమయం పట్టే అవకాశం ఉంది. అటు త్రివిక్రమ్‌తో అల్లు అర్జున్, ఇటు రామ్ చరణ్‌తో సుకుమార్ సినిమాలను ప్రకటించేశారు. కాబట్టి ‘పుష్ప3’ కోసం కొంతకాలం ఆగాల్సిందే.