టాలీవుడ్ స్టార్ హీరో రామ్‌చరణ్ కథానాయకుడిగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గేమ్‌చేంజర్’. ఈ సినిమాలో కియారా అద్వానీ కథానాయి క కాగా, ఎస్‌జే సూర్య ప్రతినాయక పాత్రలో కనిపించను న్నారు. దిల్ రాజు, శిరీష్ నిర్మిం చిన ఈ చిత్రం జనవరి 10న విడుదల కానుంది. ఈ సందర్భంగా నటుడు ఎస్‌జే సూర్య ఆదివారం మీడియాతో ముచ్చటిస్తూ ఈ సినిమా విశేషాలను పంచుకున్నారు.
“శంకర్ గారితో పని చేయా లని ప్రతి ఆర్టిస్ట్‌కీ ఉంటుంది. ఆయన ప్రతీ కారెక్టర్‌నూ చేసి చూపి స్తారు. ఆయన చెప్పింది చేస్తే చాలు అదే స్క్రీన్ మీద మ్యాజిక్‌లా కనిపిస్తుంది. నా కారెక్టర్‌ను ఎంజాయ్ చేశాను. కష్టంగా అనిపిం చినా తెలుగు, తమిళం, హిందీ ఇలా అన్ని భాషల్లో డబ్బింగ్ నేనే చెప్పా. నాకు హిందీ అంతగా రాకున్నా డబ్బింగ్ అద్భుతంగా చెప్పా.
నా హిందీ డబ్బింగ్ కోసమైనా అంతా రెండో సారి హిందీ లో సినిమా చూడాలి (నవ్వుతూ). రామ్‌చరణ్ ఈ చిత్రంలో ఆయన డిఫరెంట్ షేడ్స్‌లో కనిపిస్తారు. అప్పన్న పాత్ర అయితే లైఫ్ టైమ్ గుర్తుండిపోతుంది. రామ్‌చరణ్ గారికి, నాకు మధ్య ఉండే సీన్లు ప్రేక్షకులకు కిక్ ఇస్తాయి. ఒక్క ‘జరగండి’ పాటకే ఆడియన్స్ పెట్టే టికెట్ డబ్బులు సరిపోతాయనిపిస్తుంది.
ఓ కాఫీ కప్పులోనే ఊరి సెట్ వేసినట్టుగా అద్భు తంగా అనిపిస్తుందీ సాంగ్. కేవలం డబ్బులు పెట్టి సినిమాలు తీసే వాళ్లను నిర్మాత అనలేం. దిల్ రాజు గారు సెట్‌కు వస్తారు. అన్ని క్రాఫ్ట్‌లనూ పరిశీలిస్తారు. సెట్స్ మీదే సమస్యల్ని వెంటనే పరిష్కరి స్తారు. ఆయనకు కథల మీద మంచి పట్టుంది. ఏదైనా సరే ముక్కుసూటిగా మాట్లాడతారు. ఆయన ఆల్ రౌండ ర్.
నాకు నటుడిగా కంఫర్ట్ ఉంది. ఇప్పట్లో దర్శకత్వం గురించి ఏమీ ఆలోచించడం లేదు. ఆడుతున్న ప్పుడు ప్లేయర్ దృష్టి ఆట మీదే ఉండాలి. పక్క చూపులు చూడొ ద్దు. నటిస్తున్న ప్పుడు కేవలం నటుడిగానే ఆలోచిం చాలి. అందుకే ఈ సినిమా లో నటిస్తున్నప్పుడు నాలోని డైరెక్టర్ బయటకు రాలేదు. అయినా శంకర్ గారికి సలహా లిచ్చే స్థాయి నాకు లేదు. ఆయన చాలా విజనరీ డైరెక్టర్. రాజమౌళి వంటి వారే శంకర్ గారి గురించి గొప్పగా చెప్పారు.