calender_icon.png 22 October, 2024 | 12:23 AM

సనాతన ధర్మం నచ్చని వారు దేశం నుండి వెళ్లిపోండి..

21-10-2024 05:40:22 PM

హిందూ దేవాలయాలపై దాడులు చేస్తే ఊరుకునేది లేదు 

ముత్యాలమ్మ ఆలయ ఘటనపై  ఆగ్రహం వ్యక్తం చేసిన హిందువులు

గజ్వేల్ లో భారీ ర్యాలీ 

గజ్వేల్ (విజయక్రాంతి): సనాతన ధర్మానికి పుట్టినిల్లు అయిన భారతదేశంలో సనాతన ధర్మం నచ్చని మతాలవారు దేశం నుండి వెళ్లిపోవాలని గజ్వేల్ పట్టణ హిందువులు పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయ ఘటన విషయంలో స్పందిస్తూ సోమవారం గజ్వేల్ పట్టణంలో హిందువులు భారీ ర్యాలీ నిర్వహించారు. అంగడిపేట హనుమాన్ ఆలయం నుంచి గజ్వేల్ పోలీస్ స్టేషన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి ముత్యాలమ్మ ఘటనతో పాటు, హిందూ దేవాలయాలపై దాడులు చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలంటూ గజ్వేల్ సిఐ సైదాకు ఫిర్యాదు చేశారు. ధూప దీప నైవేద్య సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు శేషం శ్రీనివాసచార్యులు, గజ్వేల్ పట్టణ వేద పండితులు చాడ నందబాల శర్మ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సనాతన ధర్మం అంటే నచ్చని వారు ఎవరైనా దేశాన్ని విడిచిపెట్టి వెళ్లాలని పిలుపునిచ్చారు.

రోజురోజుకు హిందూ దేవాలయాలపై అన్యమతస్తుల దాడులు పెరిగిపోతున్నాయని, ఇలా కొనసాగితే హిందువులు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. ప్రభుత్వం వెంటనే దుండగులను కఠినంగా శిక్షించాలని కోరారు. ముత్యాలమ్మ ఆలయ ఘటనతో పాటు ఇటీవల సంగారెడ్డి ప్రాంతంలో జరిగిన ఘటనలోనూ నిందితులను గుర్తించి శిక్షించాలన్నారు. అందరూ బాగుండాలని సనాతన ధర్మం చెబుతుందని, అన్యాయాన్ని కూడా ఎదిరించాలని భగవద్గీతలో శ్రీకృష్ణుడు వెల్లడించారన్నారు. ఇక చూస్తూ ఊరుకోమని, దేశవ్యాప్తంగా హైందవ సోదరులంతా ఒక్కటై ప్రతిఘటిస్తామన్నారు.