టాలీవుడ్‌లో పెద్దగా రాణించలేకపోయిన తాప్సీ బాలీవుడ్‌లో దూసుకెళుతోంది. చాలా విషయాల్లో సూటిగా వ్యవహరించే ఈ ముద్దుగుమ్మ రెమ్యూనరేషన్ విషయంలో నిర్మాతల వ్యవహార శైలిపైనా అంతే నిర్మొహమాటంగా కామెంట్స్ చేసింది. తాప్సీ తాజాగా నటించిన ‘జుడ్వా 2’, ‘డంకీ’ చిత్రాలకు భారీ పారితోషికం అందుకుందంటూ ప్రచారం జరిగింది.
అయితే, ఆ వార్తల్లో నిజం లేదని తేల్చి చెప్పింది తాప్సి. “జుడ్వా 2’, ‘డంకీ’ లకు నేను భారీగా పారితోషికం తీసుకున్నానంటూ వచ్చిన వార్తలు అబద్ధం. స్టార్ హీరోలతో నటిస్తున్నప్పుడు కొందరు నిర్మాతల తీరు వేరుగా ఉంటుంది. ‘పెద్ద హీరో సినిమాలో మీకు అవ కాశమిచ్చి మీ ఉన్నతికి తోడ్పడుతున్నాం.. డబ్బుదేముం ది?’ అన్నట్టు మాట్లాడతారు.
ఇలాంటి మాట లను రోజూ వింటూ నే ఉన్నా. పెద్ద ప్రొడక్షన్‌లో చేస్తున్నామంటే మాపై చిన్నచూపు ఉంటుం ది. కాబట్టి అలాంటి వాటికి నేను తావివ్వను. వేరే సిని మాలకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నానో ఈ సినిమాలోనూ అంతే తీసుకున్నా” అని చెప్పుకొచ్చింది తాప్సీ.