* ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌ఎన్‌రెడ్డి
ముషీరాబాద్, జనవరి 26: సంఘ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడిన ట్రస్మా రాష్ట్ర కోర్ కమిటీ సభ్యుడు ఎస్ శేఖర్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు జీ నారాయణరెడ్డిలను ట్రాస్మా నుంచి బహిష్కరిస్తున్నామని తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్‌మెంట్స్ అసోసియేషన్ (ట్రస్మా) రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌ఎన్‌రెడ్డి, కోశాధికారి కే శ్రీకాంత్‌రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి చింతల రామచందర్ తెలిపారు.
ఈ మేరకు ఆదివారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. ట్రస్మా రాష్ట్ర ఆదేశాలను, నియమ నిబంధనలను పాటించని సభ్యులను సంఘం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు పీవీ రామనర్సయ్య, సూరం రామ్‌రెడ్డి, సెక్రెటరీ వేములకొండ సోమశేఖర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.