- జన్మతః పౌరసత్వం రద్దు చెల్లదన్న ఫెడరల్ కోర్టు న్యాయమూర్తి
- ట్రంప్ ఉత్తర్వులను 14రోజులపాటు నిలిపివేస్తూ ఆదేశాలు
- అప్పీలుకు వెళ్తామన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్
వాషింగ్టన్, జనవరి 24: వలసదారులకు పుట్టిన పిల్లలకు జన్మతః లభించే అమెరికా పౌరసత్వ హక్కును రద్దు చేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను సియాటిల్‌లోని ఫెడరల్ కోర్టు జడ్జి తాత్కాలికంగా నిలిపివేశారు. ట్రంప్ ఇచ్చిన ఆదేశాలను వ్యతిరేకిస్తూ వాషింగ్టన్, ఇల్లినాయీస్, ఓరెగాన్ రాష్ట్రాలు వేసిన వాజ్యంపై యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి జాన్ సి కాఫ్నర్ గురువా రం విచారణ జరిపారు.
ఈ కేసులో వాదనలు విన్న న్యాయమూర్తి.. ట్రంప్ ఇచ్చిన ఆదేశాలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని స్పష్టం చేశా రు. 14 రోజులపాటు అధ్యక్షుడి ఆదేశాలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. 40ఏళ్ల నా అనుభవంలో బెంచ్‌కు సమర్పించిన ప్రశ్న ఇంత స్పష్టంగా ఉన్న సందర్భం తనకు గుర్తులేదని ఈ సందర్భంగా జడ్జి కాఫ్నర్ పేర్కొన్నా రు.
తదుపరి విచారణను ఫిబ్రవరి 6కు వాయి దా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. జడ్జి కాఫ్నర్ కేసు విచారణ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్య లు చేశారు. మీ దృష్టిలో ట్రంప్ తీసుకొచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ రాజ్యాంగ బద్ధమైనదేనా? అని అటార్నీ బ్రెట్ షూమెట్‌ను ప్రశ్నించారు. దీనికి అటార్నీ బదులిస్తూ ట్రంప్ ఉత్తర్వు కచ్చితంగా రాజ్యాంగబద్ధంగానే ఉందన్నారు.
అ టార్నీ సమాధానం పట్ల జడ్జి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బార్‌లోని ఒక సభ్యుడు ఇది రాజ్యాంగబద్ధమైన ఉత్తర్వు అని నిస్సందేహం గా ఎలా చెప్పలగుతున్నారో తన కు అర్థం కావటం లేదన్నారు. ఇది తన మనసును కలిచివేసినట్టు పేర్కొన్నారు. కోర్టు ఆదేశాలపై స్పందించిన ట్రంప్.. ఈ విషయంపై తన కార్యవర్గం అప్పీలుకు వెళ్తుందని ప్రకటించారు.
538 మంది వలసదారులు అరెస్ట్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని ప్రభుత్వం అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతుంది. ఇప్పటి వరకూ 538 అక్రమవలసదారులను పోలీసులు అరెస్ట్ చేసినట్టు శ్వేతసౌధం ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ఎక్స్ ద్వారా ప్రకటించారు. అమెరికా చరిత్రలోనే అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్ కొనసాగుతున్నట్టు పేర్కొన్నారు.
సైనిక విమానాల్లో వందలాది మంది అక్రమ వసలదారులను దేశం నుంచి బయటకు పంపినట్టు తెలిపారు. అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించడంతో పాటు దొంగతనాలకు, హింసకు పాల్ప డే వారిని నిర్బంధించే బిల్లుకు అమెరికా ప్రతినిధుల సభ బుధవారం ఆమోదం తెలిపింది.
అక్రమవలసదారుల బహిష్కరణకు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై ట్రంప్ సంతకం చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు.. అక్రమవలసదారులను ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు.
అమెరికాలో పుట్టిన పిల్లలకూ భారత పౌరసత్వం!
అమెరికాకు వలస వెళ్లిన వారికి పుట్టిన పిల్లలకు జన్మతః అమెరికా పౌరసత్వం లభించే హక్కును రద్దు చేస్తూ ట్రంప్ ఇటీవల కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వులు ఫిబ్ర వరి 20 నుంచి అమలులోకి రానున్నా యి. ఈ క్రమంలో హెచ్1బీ, ఎల్1 వంటి పలు వీసాల మీద అమెరికాకు వె ళ్లిన భారతీయులకు ఫిబ్రవరి 20 తర్వా త పిల్లలు పుడితే ఆ చిన్నారులకు ఏ దేశ పౌరసత్వం లభిస్తుందనే చర్చ మొదలైంది.
దీనిపై యూనివర్సల్ మైగ్రేషన్ సర్వీసెస్ అడ్వైజర్ సుల్తాన్ అహ్మద్ మాట్లాడుతూ ట్రంప్ ఆదేశాలు అమలులోకి వస్తే అమెరికాలో వలసదారులకు పుట్టే పిల్లలకు ఆ దేశ పౌరసత్వం లభించదన్నారు.
ఇండియాలో పిల్లల పౌరస త్వం తల్లిదండ్రుల జాతీయతపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. తల్లిదం డ్రులు ఇద్దరూ భారతీయులు అయితే వారి పిల్లలకు కూడా భారతీయ పౌరసత్వం లభిస్తుందని తెలిపారు.