calender_icon.png 20 April, 2025 | 4:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆ నాయకులు నక్సలైట్ల వారసులు

20-04-2025 12:40:31 AM

కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్

హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 19 (విజయక్రాంతి): కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయ కులు నక్సలైట్ల వారసులు అని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. శనివారం సాయంత్రం బర్కత్‌పురాలోని బీజేపీ నగర కార్యాలయంలో బీజేపీ కార్పొరేటర్లు, నేతలతో ఆయన భేటీ అయ్యారు. స్థానిక సంస్థ ల ఎమ్మెల్సీ ఎన్నికలపై వారికి దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. ప్రజాస్వామ్యంలో ఉంటూ ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉంటారా అని కాం గ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలపై మండిపడ్డారు. మజ్లిస్‌ను గెలిపించేందుకు కుట్ర చేస్తారా.. దానిపై హిందూ సమాజమంతా రగిలిపోతోందని విమర్శించారు.

విప్‌కు భయపడి ఓటింగ్‌కు దూరమైనా, మజ్లిస్‌కు ఓటేసినా కార్పొరేటర్ల భవిష్యత్ ఖతమేనని హెచ్చరించారు. వక్ఫ్‌పై మజ్లిస్ భహిరంగ సభ స్పాన్స ర్డ్ ప్రోగ్రామని విమర్శించారు. దమ్ముంటే తెలంగాణలోని వక్ఫ్ ఆస్తులు, ఆదాయ వ్యయాలపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.