16-03-2025 01:57:05 AM
‘లాపతా లేడీస్’తో నితాన్షీ గోయల్ మంచి నేమ్, ఫేమ్ సంపాదించింది. ఈ చిత్రంలో ఫూల్ కుమారీ పాత్రలో ఈ ముద్దుగుమ్మ మెరిసింది. తాజాగా ఈ యంగ్ హీరోయిన్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించింది. అందరూ తనను శ్రద్ధా కపూర్‌తో పోలుస్తున్నారని.. అది తనకు ప్రశంస అని పేర్కొంది. “లాపతా లేడీస్’తో నా జీవితమే మారిపోయింది. ఎక్కడికెళ్లినా నన్ను పూల్ అని పిలవడం సంతోషంగా అనిపిస్తోంది. అంతేకాకుండా సోషల్ మీడియాలోనూ నాకు ఫాలోవర్స్ సంఖ్య పెరిగింది. ఇటీవల నేను షేర్ చేసిన ఫోటోలపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
ముఖ్యంగా నేను వాటిలో శ్రద్ధా కపూర్‌లా ఉన్నానంటున్నారు. ఆ కామెంట్స్ నన్ను బాధ పెట్టకపోగా ఎంతో సంతోషాన్నిచ్చాయి. అది నాకొక ప్రశంస. నేను శ్రద్ధాకు వీరాభిమానిని. ఆమె మాదిరిగానే నేను కూడా కెరీర్‌లో రాణించాలను కుంటున్నా. అలాగే యూకే టాప్ 50 ఏషియన్ సెలబ్రిటీల జాబితాలో అమితాబ్ బచ్చన్, ప్రియాంక చోప్రా వంటి అగ్ర తారలతో పాటు చోటు దక్కించుకోవడం నా అదృష్టం. చాలా గర్వంగా అనిపించడంతో పాటు నాలో స్ఫూర్తి నింపింది. ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేను” అని నితాన్షి వెల్లడించింది.