calender_icon.png 16 January, 2025 | 12:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆ సొట్టబుగ్గలు అందమే కానీ..!

31-08-2024 12:00:00 AM

చాలామంది అమ్మాయిలు సొట్టబుగ్గలు కావాలని కోరుకుంటారు. అబ్బాయిలు కూడా సొట్టబుగ్గల అమ్మాయిలను ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అందుకే ఈతరం అమ్మాయిలు సొట్టబుగ్గలపై మనసు పారేసుకుంటున్నారు. బుగ్గలపై సొట్ట ఉంటే అందంతో పాటు అదృష్టం కూడా అని నమ్ముతున్నారు. షారుక్ ఖాన్ నుంచి ప్రీతి జింటా, అలియా భట్ ఎంతోమంది సెలబ్రిటీలు సొట్టబుగ్గలతో ఫ్యాన్స్ ను మెస్మరైజ్ చేస్తుంటారు. అందుకే ఫేక్ డింపుల్ వాడకంపై ఇన్‌ఫ్లూయర్స్ ఎక్కువగా కోరుకుంటున్నారు. ఇన్ స్టాలో 230 వేల ఫాలోవర్లు కలిగిన ఓ కంటెంట్ క్రియేటర్ రియాక్ట్ అవుతూ.. ఫేక్ డింపుల్స్‌కు ఫుల్ డిమాండ్ ఉంది. ఎందుకంటే ఎలాంటి ట్రీట్ మెంట్ లేకుండా ముఖాన్ని అందంగా మార్చేస్తున్నాయని అన్నారు. 

అయితే జన్యుపరమైన వ్యత్యాసం వల్ల డింపుల్స్ వస్తాయి. ఇక వారసత్వంగా వస్తాయి కూడా. పిండం అభివృద్ధి సమయంలో జైగోమాటికస్ మేజర్ కండరం అని పిలువబడే కండరం పెరగడం వల్ల డింపుల్స్ వస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. ఇక తల్లిదండ్రులకు సొట్టబుగ్గలు ఉంటే పిల్లలకు 90 శాతం వరకు వచ్చే అవకాశం ఉంది. అయితే.. తల్లికో లేదా తండ్రికి మాత్రమే సొట్టబుగ్గ ఉంటే పిల్లలకు 40 శాతం వచ్చే అవకాశం ఉంది. అమ్మాయిలు ఎవరైనా డింపుల్ క్రియేషన్ ట్రీట్‌మెంట్‌తో గంటలో సొట్టబుగ్గను సొంతం చేసుకోవచ్చు. అయితే ఫేడ్ డింపుల్ ట్రీట్‌మెంట్ చేసే క్రమంలో ఆ సౌందర్య సాధనాలు రసాయనాలతో ఉంటాయి. బుగ్గలపై ఒత్తిడి పడితే నల్లగా మారి ఆ తర్వాత అందహీనం అవుతుంది.