05-04-2025 01:48:57 AM
‘ఎక్స్’లో కేటీఆర్ ట్వీట్
హైదరాబాద్, ఏప్రిల్ 4 (విజయక్రాంతి): హెచ్‌సీయూలో జింకపై కుక్కలు దాడి చేసి చంపిన ఘటనపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేతికే జింక రక్తపు మరకలు అంటాయని వాపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం కంచ గచ్చిబౌలి భూములను ధ్వంసం చేయడంతోనే ఈ ఘటన జరిగిం దన్నారు.
మన స్టార్టప్‌లు వినూత్నమైనవి
స్టార్టప్‌లపై కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి చేసిన కామెంట్స్‌పై కేటీఆర్ మరో ట్వీట్ చేశారు. మన దేశ స్టార్టప్‌లు వినూత్నమైనవన్నారు. పాత చట్టాలు, టారిఫ్‌ల నిబంధనలున్నప్పటికీ తాము స్పేస్‌టెక్, ఫిన్‌టెక్, రోబొటిక్స్ లాంటివి ప్రొత్సహించామన్నారు. వాణిజ్య మంత్రి వ్యాఖ్యలతో ఏకీభవించమన్నారు.