ఒలింపిక్ క్రీడా గ్రామంలో ఏర్పాట్లు చేసిన మంచాలపై పలు విమర్శలు వెల్లువెత్తగా.. నిర్వాహకులు వాటిని కొట్టి పారేశారు. అథ్లెట్ల కోసం సిద్ధం చేసిన మంచాలు మరీ చిన్నగా ఉన్నాయని.. వాటిపై శృంగారం చేయడం సాధ్యం కాదని పలువురు విమర్శించడంతో ఈ అంశం వెలుగులోకి వచ్చింది. అయితే ఈ మంచాలను అట్టముక్కలతోనే చేసినా.. ఇవి సౌకర్యవంతంగా ధ్రుఢంగానే ఉంటాయని నిర్వాహకులు స్పష్టం చేశారు. కాగా.. ఒలింపిక్ క్రీడలకు ముందు మంచాల నాణ్యతపై ప్రశ్నలు తలెత్తడంతో అథ్లెట్లు వాటిని పరీక్షిస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.