calender_icon.png 15 November, 2024 | 1:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అవే నాకు చివరి రోజులనుకున్నా

07-11-2024 12:00:00 AM

ప్రముఖ నటి మనీషా కొయిరాల అండాశయ క్యానర్ బారిన పడి మూడేళ్లు పోరాడింది. ప్రస్తుతం వెబ్ సిరీస్‌లతో బిజీగా కాలం గడిపేస్తున్న ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో క్యాన్సర్ సమయంలో తాను అనుభవించిన బాధను వెల్లడించారు. 2012 నుంచి 2015 వరకు మనీషా గర్భాశయ క్యాన్సర్‌తో బాధపడ్డారు. ఈ విషయమై ఆమె మాట్లాడుతూ..

“క్యాన్సర్‌కు చికిత్స తీసుకుంటున్న సమయంలో భరించలేని బాధ, నొప్పి అనుభవించా. ఎలాంటి లక్షణాలు లేకుండా చివరి దశలో ఉన్నప్పుడు ఈ మహమ్మారి నాలో ఉందని తెలిసింది. మొదట భయపడ్డా. చనిపోతాను.. ఇవే నాకు చివరి రోజులు అనుకున్నా. వైద్యం కోసం న్యూయార్క్‌లో ఆరు నెలలున్నాను.

అక్కడి గొప్ప వైద్యులు నాకు 11 గంటల పాటు ఆపరేషన్ చేశారు. కీమో థెరపీ గురించి నా కుటుంబ సభ్యులకు వివరించారు. ఆ సమయంలో మా అమ్మే నాకు అన్ని విధాలా తోడుండి ధైర్యం చెప్పారు. నా పేరు మీద పూజలు, మృత్యుంజయ హోమాలు చేశారు. అమ్మ ఇచ్చిన ధైర్యంతో క్యాన్సర్‌ను జయించా. ఇది నాకు దేవుడిచ్చిన పునర్జన్మ” అని మనీషా తెలిపారు.