06-03-2025 01:13:07 AM
కోనరావుపేట, మార్చి 5: బీఆర్‌ఎస్ నాయకులు మతిభ్రమించి మాట్లాడుతున్నారని, కేటీఆర్ రైతులపై ముసలి కన్నీరు కారుస్తూ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆరోపించారు. బుధవారం కోనరావుపేట మండ లం ధర్మారం గ్రామంలో మల్కపేట రిజర్వాయర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కేటీఆర్ ఇంకా రైతులను మభ్య పెట్టాలని ఏవేవో అబూత కల్పనలు చెప్పడం మానుకోవాలి అన్నారు.
కెసిఆర్ అంటేనే కాలేశ్వరం అని కాలేశ్వరం లేకుంటే సిరిసిల్ల పరిధిలోని గిరిజన తండాలకు సాగునీరు అందిస్తుండే అని కేటీఆర్ ఓ కట్టుకథ ఆల్లి పోయిండని అన్నారు. కేటీఆర్ మీ 10 సంవత్సరాల పాలనలో మల్కాపేట రిజర్వాయర్ నుండి సిరిసిల్ల పరిధిలోని అల్మాస్పూర్ కాల్వ వరకు ఒక్క గ్రామానికి అన్న చుక్క నీరు తీసుకెళ్లావా అని ప్రశ్నించారు. కేటీఆర్ మంత్రిగా ఎమ్మెల్యేగా ఉన్న సిరిసిల్ల నియోజకవర్గంలోని ఎల్లారెడ్డిపేట ప్రాంతానికి ఒకే ఎకరం,ఒక గుంటకైనా మల్కాపేట రిజర్వాయర్ నుండి నీరు తీసుకెళ్లాడా అని విమర్శించారు.
మీ ప్రాంతానికి చెందిన అన్ని వర్గాల రైతులు వచ్చి మా పొలాలు ఎండిపోతున్నాయని నీరు ఇవ్వాల్సిందిగా కోరితే సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి ఉమ్మడి జిల్లా మంత్రులతో మాట్లాడి గిరిజన తండా గుట్టల వరకు కాలువల ద్వారా నీరు ఇచ్చామన్నారు. రెండో విడత కూడా రైతులకు నీరు అందిస్తామని చెప్పారు. ఎస్ ఎల్ బి సి ప్రమాదం జరగడం వలన ఆలస్యమై అధికారులతో మాట్లాడి నీటి విడుదల చేస్తామని చెప్పిన మాటలు కేటీఆర్ చెవిలో పడడంతో ఇక్కడికి వచ్చి రైతులపై కపట ప్రేమను వలకబోస్తూ మొసలి కన్నీరు కార్చాడన్నారు.
ఆనాడు రైతులు వరేస్తే ఉరే అన్న మీరు దొడ్డు రకాలు వెయ్యద్దు సన్నపు రకాలు వేయాలని మీ నాన్న ఫార్మ్ హౌస్ లో దొడ్డు రకాలు వేయలేదా అని ప్రశ్నించారు. కేటీఆర్ ఇప్పటికైనా రైతుల పై కపట ప్రేమను చూపిస్తూ మేమ్ చెప్తేనే నీరు వచ్చిందని చెప్పడం సిగ్గుచేటు అన్నారు. వర్షాకాలం పంటలు చుక్క కాళేశ్వరం నీరు వాడకుండా రైతులు 1.50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించడం జరిగిందన్నారు. రైతులకు నీరు విడుదల చేసే సమయంలో రెడీబిలిటీ కాంగ్రెస్ పార్టీకి వెళ్తుందని ఆగమేఘాల మీద కేటీఆర్ వచ్చి రైతులపై కపట ప్రేమ ప్రదర్శించాడన్నారు.
వేములవాడ నియోజకవర్గం లో లేని కాలువను ఎవరో ఎండ కొడుతున్నారని ఏదో సోషల్ మీడియాలో చూపెట్టి రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారు. సోషల్ మీడియాలో పెట్టిన తల్లి ఒకసారి వచ్చి చూడు వేములవాడ సిరిసిల్ల నియోజకవర్గంలో అన్ని కాలువల్లో నీళ్లు పారుతున్నాయి. బీఆర్‌ఎస్ ఉన్నప్పుడు నీళ్లు ఇచ్చాం కాంగ్రెస్ వచ్చాక నీళ్లు ఇవ్వడం లేదని మాట్లాడే మాటలు శుద్ధ అబద్ధమని అన్నారు.
కేటీఆర్ మీ హయాంలో పడవ పడ్డ మొలకపేట ప్రాజెక్టు పనులను మేము వచ్చాక ప్రారంభించామని, కాంట్రాక్టర్లకు మీరు పెట్టిన రూ.11 కోట్ల బకాయిలను మా ప్రభుత్వం వచ్చాక చెల్లించామన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఎల్లంపళ్లి , ఎల్‌ఎండి, ఎంఎండి నుండి రైతులకు సాగునీరు అందించడం జరుగుతుంద న్నారు. రైతులారా బీజేఆర్‌ఎస్ పార్టీ చేసే రాజకీయాలను గమనించాలని కోరారు. అలాగే ప్రాజెక్టు నుండి కాలువల ద్వారా చెరువులను నింపే అవకాశం ఉంటే నింపాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్య క్రమంలో కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు కేతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మ న్ కచ్చకాయలు ఎల్లయ్య, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఫిరోజ్ పాషా, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ప్రభాకర్,డైరెక్టర్లు,నాయకులు బొర్ర రవీందర్, కార్తీక్ గౌడ్,భాస్కర్, శ్రీనివాస్ గౌడ్, అంజయ్య, నాయకులు, ప్రాజెక్ట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.