23-04-2025 01:14:55 AM
గూడూరు, ఏప్రిల్ 22: (విజయ క్రాంతి) :ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్ష ఫలితాల్లో తొర్రూర్ కు చెందిన గడల రామ్ చరణ్ రాష్ట్రస్థాయిలో ౩ ర్యాంకు సాధించాడు. హనుమకొండ లోని ప్రతిభ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న రామ్ చరణ్ మంగళవారం తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రథమ సంవత్సరం బైపీసీ విభాగంలో 440 మార్కులకు గడల రామ్ చరణ్ 436 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో మూడవ ర్యాంకు సాధించాడు.
అదేవిధంగా ఇంటర్ ఫలితాల్లో ప్రతిభా జూనియర్ కళాశాల చెందిన పలువురు విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించి విజయదుందుభి మ్రోగించారు. ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ఎంపీసీ విభాగంలో 470 మార్కులకు గాను ఎం అంజలి అనే విద్యార్థిని 466 మార్కులు, బి శరణ్య మోలి 464 మార్కులు, జి కీర్తన 452 మార్కులు, బి దీపిక, ఎం అభినవ్ అమృత 461 మార్కులు, బి హాసిని 460 మార్కులు సాధించారు. అదేవిధంగా సిఇసి విభాగంలో దియా మండల్ 469 మార్కులు సాధించారు.
కాగా ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీ విభాగంలో ఆర్ వైష్ణవి 986 మార్కులు 983 మార్కులు ఎం సోనియా 981 మార్కులు బైపిసి విభాగంలో ప్రియాంక బౌమిక్ 967 మార్కులు సాధించి విజయకేతనం ఎగురవేశారు. ఈ సందర్భంగా కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో కళాశాల డైరెక్టర్లు కేఎల్‌ఎన్ ఆచార్య, కే సత్యనారాయణ రెడ్డి , శ్రవణ్ రావు, తిరుపతి తదితరులు మాట్లాడుతూ ఇంటర్మీడియట్ ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించి తమ కళాశాల ప్రత్యేకతను మరోసారి చాటిచెప్పిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు.