18-02-2025 12:00:00 AM
అధికారులను ఆదేశించిన కలెక్టర్ జితేష్ వి.పాటిల్
భద్రాద్రి కొత్తగూడెం ఫిబ్రవరి 17 (విజయక్రాంతి) : ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
సోమవారం ఐడిఓసి కార్యాలయ సమావేశ మందిరంలో అన్ని శాఖల అధికారులతో ప్రజావాణి నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఎండార్స్ చేశారు. ఈ సందర్భంగా దరఖాస్తు చేసిన అభ్యర్థులను వివరాలను అడిగి తెలుసుకొని సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని శాఖల వారీగా అధికారులను ఆదేశించారు.
కొత్తగూడెం పట్టణంలో నివాసం ఉంటున్న ఆకుల నాగేశ్వరరావు అక్షరటౌన్ షిప్ కొత్తగూడెం బ్రాంచ్‌లో రూ.4 లక్షలు నెల వడ్డీకి డిపాజిట్ చేశానని, అందులో రూ 3 లక్షలు గడువు తీరిన పైకము తిరిగి చెల్లించడం లేదని, ఈ విషయమై మేనేజర్ రూ3 లక్షల చెక్కు ఇచ్చారనీ, బ్యాంకులో వేస్తే అధికారులు రిటన్ చేశారని, కావున తన డబ్బులు ఇప్పించగలరని కలెక్టర్కు ఫిర్యాదు చేశాడు.
పరిశీలించి తగు చర్యలు నిమిత్తం కొత్తగూడెం ఎస్పీకి ఎండార్స్ చేయడం జరిగింది. పాల్వంచ మండలం జగన్నాధపురం గ్రామానికి చెందిన ధర్మసొత్ గోపాల్ తన భూమిని గిరిజనేతరులు ఆక్రమించుకొనుగా,
భద్రాచలం %ఐఈ్పు (అఇ%) వారి కోర్టులో ఎల్ టి ఆర్ కేసు పెట్టగా,2019 మే 22న ఆర్డర్లు ఇస్తూ భూమిని తనకు అప్పగించాలని పాల్వంచ తహసిల్దార్‌కు ఆదేశాలు జారీ చేసినా, ఇప్పటివరకు తహసి ల్దార్ భూమిని తనకు అప్పగించుటలేదని, కోర్టు ఆదేశాల మేరకు భూమిని నాకు అప్పగిం చాలా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.