calender_icon.png 8 January, 2025 | 8:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎసీబీకి చిక్కిన తొర్రూర్ సీఐ

07-01-2025 01:34:41 AM

మహబూబాబాద్, జవరి 6 (విజయక్రాంతి): పీడీఎస్ బియ్యం వ్యాపారి నుంచి రూ.5 లక్షల లంచం డిమాండ్ చేసిన తొర్రూర్ సీఐ జగదీశ్ ఏసీబీకి పట్టుబడ్డాడు. మహ  జిల్లా తొర్రూర్‌కు చెం  పీడీఎస్ బియ్యం వ్యాపారి గతేడాది అక్టోబర్ 2న అక్రమంగా తరలిస్తున్న బియ్యం లారీని దంతాలపల్లి మండలంలో పోలీసులు పట్టుకుని, లారీని సీజ్ చేశారు.

లారీని విడిచిపెట్టేందుకు సీఐ జగదీశ్ సదరు బియ్యం వ్యాపారిని రూ.5లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. సదరు వ్యాపారి రూ.2 లక్షలు ఇచ్చాడు. మిగిలిన డబ్బులు కూడా ఇవ్వాలని సీఐ డిమాండ్ చేశాడు. విసుగు చెందిన వ్యాపారి ఫోన్‌లో రికార్డు చేసిన ఆడియోతో ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. సోమవారం తొర్రూర్ సీఐ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించి సీఐ జగదీశ్ అవినీతి ఆరోపణలు నిర్ధారించుకొని కేసు నమోదు చేశారు. జగదీశ్‌ను వరంగల్ ఏసీబీ కార్యాలయానికి తరలించారు.