calender_icon.png 9 October, 2024 | 3:57 AM

ఈ వారం క్యూ2 ఫలితాల సీజన్ ప్రారంభం

07-10-2024 01:01:07 AM

న్యూఢిల్లీ, అక్టోబర్ 6: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసిక ఫలితాల సీజన్ ఈ వారం ప్రారంభం కానున్నది. సెప్టెంబర్ 30తో ముగిసిన త్రైమాసికానికి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌స్ (టీసీఎస్), ఇండియన్ రెన్యువబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ఐఆర్‌ఈడీఏ), ఎవిన్యూ సూపర్‌మార్ట్స్ (డీమార్ట్) తదితర ప్రధాన కంపెనీలు ఈ వారంలో ఆర్థిక ఫలితాల్ని వెల్లడిస్తాయి.

అక్టోబర్ 10న ఐటీ దిగ్గజం టీసీఎస్ ఫలితాల్ని ప్రకటిస్తుంది. అదే రోజున ఐఆర్‌ఈడీఏ, టాటా ఎలక్సీలతో పాటు ఇటీవల లిస్టయిన ఆర్కడే డెవలపర్స్ క్యూ2 ఫలితాలు వెలువడతాయి. అక్టోబర్ 11న హాథ్‌వే కేబుల్, రిలయన్స్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫలితాలు వెల్లడవుతాయి. డీమార్ట్ రిటైల్ స్టోర్స్‌ను నిర్వహించే ఎవిన్యూ సూపర్‌మార్ట్స్ అక్టోబర్ 12న క్యూ2 ఫలితాల్ని ప్రకటిస్తుంది.