calender_icon.png 27 October, 2024 | 8:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈ రైలు పారిశ్రామికవేత్తల కోసం మాత్రమే

27-10-2024 01:26:36 AM


500 మందికి మాత్రమే జర్నీ అవకాశం

నవంబర్ 16న ముంబై నుంచి ప్రారంభం

ముంబై, అక్టోబర్ 26: ప్రపంచంలో ముఖ్యమైన ఆర్థికశక్తిగా భారత్ ఎదగడంలో పారిశ్రా మికవేత్తలు కీలకపాత్ర పోషిస్తున్నారు. ముఖ్యం గా సాఫ్ట్‌వేర్ రంగలో భారత్ రారాజుగా వెలుగుతోంది. సిలికాన్ వ్యాలీలోని అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి ప్రఖ్యాత కంపెనీలను భారతీయులే ముందుండి నడిపిస్తున్నా రు. ఈ నేపథ్యంలో దేశంలోని యువతను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి ముంబైకి చెందిన జాగృతి సేవాసంస్థాన్ అనే స్వచ్ఛంద సంస్థ నడుం బిగించి ఓ ప్రత్యేక రైలును  నడుపుతోంది. 2008లో ప్రారంభమైన ఈ రైలు యాత్ర దేశంలోని 12 నగరాల్లో మాత్రమే ప్రయాణిస్తుంది. ఇందులో కేవలం 500 మంది ఔత్సాహికులకు మాత్రమే అనుమతిస్తారు. వీరంతా 15 రోజల పాటు దాదాపు  ఎనిమిది వేల కిలోమీటర్లు ప్రయాణిస్తారు. దానిలోనే వీరికి అన్ని సౌకర్యాలను కల్పిస్తారు. ఈ ఏడాది నవంబర్ 16న ముంబైలో ప్రారంభం కానున్న యాత్ర డిసెంబర్ 1న ముగుస్తుంది. 

దేశంలోని టైర్ టైర్ నగరాల్లో అందుబాటులో ఉన్న అవకాశాలు, సమస్యలు, సవాళ్లు, వాటి పరిష్కారాలపై చర్చలు జరుపుతారు. ఈ ప్రయాణంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అగ్రికల్చర్, ఎడ్యుకేషన్, హెల్త్,  వాటర్ రిసోర్సెస్, పారిశుద్ధ్యం, లిటరేచర్, సంస్కృతి, సంప్రదాయాలు, మహిళల సాధికారత, క్రీడలు తదితర అంశాల్లో నిపుణులైన వ్యక్తులు వీరికి మార్గదర్శకులుగా ఉండి ముందుకు నడిపిస్తారు. వైజాగ్ , చెన్నై, మధురై , బెంగళూరు, హుబ్బళ్లి , ముంబై, ఢిల్లీ, రాజ్‌గిరి, బ్రహ్మపుర, దేవారియా, అహ్మదాబాద్, తిలోనియా తదితర నగరాల్లో ఈ రైలు ప్రయాణిస్తుంది. ఈ ప్రయాణంలో గ్రూప్ డిస్కషన్స్, మీటింగ్స్ ప్లాన్ చేయడం, ప్రజెంటేషన్ ఇవ్వడం, తదితర విషయాలను యువ పారిశ్రామికవేత్తలు  నేర్చుకుంటారు. ఇందుకోసం వీరికి స్ఫూర్తిని ఇవ్వడానికి ఆయా రంగాల్లో నిష్ణాతులైన వ్యక్తులతో ట్రైనింగ్ ఇస్తారు. అంతేకాక వారిలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడానికి మెగా ఈవెంట్లను కూడా నిర్వహించి వారిని ప్రోత్సహిస్తారు. పారిశ్రామికవేత్తలుగా మారాలనే ఆసక్తి ఉన్న యువత ఈ జర్నీలో పాల్గొనడానికి జాగృతి సంస్థకు చెందిన అధికారిక వెబ్‌సైట్‌లో టికెట్లను బుక్  చేసుకోవాలి. అయితే ఈ సంవత్సరం రైలు జర్నీకి సంబంధించిన రిజిస్ట్రేషన్ పూర్తియింది. ఇప్పటివరకు ప్రప ంచలోని 23 దేశాల నుంచి దాదాపు 75 వేల మందికి పైగా ప్రయాణంలో పాల్గొన్నారు.