రిజర్వ్‌బ్యాంక్ ద్రవ్య పరపతి సమీక్షపై నిపుణులు
ముంబై: దేశీయంగా వృద్ధి నెమ్మదించి న వేళ వినియోగం పెంచేలా ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు ఊరటనిస్తూ కేం ద్రం బడ్జెట్లో కీలక నిర్ణయం తీసుకుంది. రూ. 12 లక్షల వరకు ఎలాంటి ఆదాయపు పన్నూచెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొంది. దీనికి ఊతం ఇచ్చేలా ఆర్బీఐ సైతం 25 బేసి స్ పాయింట్ల మేర వడ్డీ రేట్లు తగ్గించొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏడాదిగా ద్రవ్యోల్బణం ఆర్బీఐ లక్షిత పరిధి 6 శాతానికిలోపే ఉండటంతో వృద్ధికి బాటలు వేసేలా ఆర్బీఐ నుంచి రేట్ల కోత నిర్ణయం వెలువడొచ్చని అంచనా వేస్తున్నారు.
2023 ఫిబ్రవరి నుం చి రెపో రేటును 6.5 శాతం వద్ద స్థిరంగా కొనసాగిస్తోంది. మే 2020లో వడ్డీ రేట్లు తగ్గించిన ఆర్బీఐ.. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు క్రమంగా పెంచుతూ 6.5 శాతం వద్ద గరిష్ఠ స్థాయికి చేర్చింది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ గవర్నర్‌గా కొత్తగా నియమితులైన సంజయ్ మల్హోత్రా నేతృత్వంలో తొలి ద్రవ్య పరపతిసమీక్ష (ఎంపీసీ) భేటీ బుధవారం ప్రారంభం కానుంది.
శుక్రవారం (ఫిబ్రవరి 7న) ఎంపీసీ సమావేశ నిర్ణయాలు వెలువడనున్నాయి. ఒకవేళ అంద రూ అంచనా వేస్తున్నట్లు ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గిస్తే ఆ మేర గృహ, వాహన రుణాల వడ్డీ రేట్లు కాస్త తగ్గుముఖం పడతాయి. అదే సమయంలో ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను సైతం బ్యాంకులు తగ్గిస్తాయి.