calender_icon.png 19 April, 2025 | 11:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈ సబ్ రిజిస్టార్ మాకొద్దు

12-04-2025 01:14:59 AM

బూర్గంపాడు సబ్ రిజిస్టార్ పై రెవెన్యూ మంత్రికి ఫిర్యాదు

బూర్గంపాడు,ఏప్రిల్ 11 (విజయక్రాంతి):తరచూ మద్యం సేవించి విధులకు హాజరవుతూ,  కార్యాలయంకు వచ్చే ప్రజలను నానా ఇబ్బందులకు గురి చేస్తున్న సబ్ రిజిస్టార్ మాకొద్దు అంటూ పలువురు స్థానికులు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఫిర్యాదు చేసి,వినతి పత్రం అందించారు. శుక్రవారం బూర్గంపాడు మండలంలో పర్యటించిన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ని కలిసిన స్థానికులు తమ గోడును వెళ్లబుచ్చుకున్నారు.

ఐదు మండలాలకు సేవలు అందించవలసిన బూర్గంపాడు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సబ్ రిజిస్టర్ గా నియమితులైన సీనియర్ అసిస్టెంట్, ఇంచార్జ్ సబ్ రిజిస్టర్ ఎస్ కే.ఖదీర్ తరచు మద్యం సేవించి కార్యాలయానికి హాజరవుతున్నారని స్థానికులు మంత్రికి తెలిపారు.

కార్యాలయానికి వచ్చే ప్రజలతో మర్యాద లేకుండా మాట్లాడుతూ, అకారణంగా గొడవలు పడుతున్నారని వినతి పత్రంలో పేర్కొన్నారు. సర్టిఫికెట్స్ కోసం వచ్చే ప్రజలను లంచాలు అభ్యర్థిస్తూ, ఇవ్వకపోతే కాలయాపన చేస్తూ నానా ఇబ్బందులు పెడుతున్నారని, సదరు రిజిస్ట్రార్ గతములో పనిచేసిన చోట మూడు సార్లు సస్పెండ్ అయి ఉన్నాడని మంత్రికి తెలిపారు.

అయినా తీరు మార్చుకోకుండా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వివరించారు. బూర్గంపాడు సబ్ రిజిస్టర్ పైన చర్యలు తీసుకుని,వేరే రిజిస్ట్రార్ ను బూర్గంపాడు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో నియమించి మండలములోని ప్రజలకు న్యాయము చేయాలని స్థానిక ప్రజలు మంత్రిని కోరారు.