calender_icon.png 23 February, 2025 | 8:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈ ఉప్పు.. కిలో రూ.30వేలు!

23-02-2025 12:17:10 AM

ఆవకాయ మొదలగు పచ్చళ్ళకు, చేపలు ఎక్కువ కాలం నిలువ ఉంచడానికి ఉప్పు వాడుతారు. ఉప్పు ఖరీదు పదుల్లో ఉంటుంది. కానీ, ఈ ఉప్పు ఖరీదు మాత్రం రూ.20 నుంచి రూ.30 వేలు ఉంటుందట. ఇంతకీ ఈ ఉప్పు పేరేంటి? దాని ప్రత్యేక ఏంటి? అని సందేహ పడుతున్నారా? దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం.. బొంగులో ఉప్పు, బాంబూ ఉప్పు చాలా స్పెషల్. దీన్ని పర్పుల్ సాల్ట్ అని కూడా పిలుస్తారు.

దీన్ని కొరియన్లు అధికంగా వాడతారు. కొన్ని వందల ఏళ్ల నుంచి వారి సంప్రదాయ ఆహారంలో ఔషధాల తయరీలో బొంగులో ఉప్పు భాగమైపోయింది. ఈ ఉప్పును బొంగులో తయారు చేస్తారు కాబట్టి దీన్ని బాంబూ సాల్ట్ అని పిలుస్తారు. ఈ ఉప్పు తయారు చేయడానికి దాదాపు 45 రోజుల సమయం పడుతుంది. ఉప్పు తయారీలో ఎక్కడా మెషీన్లను ఉపయోగించారు.

సముద్రపు నీరు నుంచి తయారు చేసిన ఉప్పును వెదురు బొంగుల్లో నింపుతారు. బొంగు రెండువైపుల బంకమన్నుతో మూసేస్తారు. ఆ బొంగును మంటల్లో వేసి బాగా కాలుస్తారు. అత్యధికంగా 800 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద కాలుస్తారు.

వెదురు నుంచి నూనె, రసాలతో ఉప్పు కలిసిపోతుంది. వాటిలోని పోషకాలు కూడా ఉప్పుకు పడతాయి. దీనివల్ల ఉప్పు మరింత రుచిగా, పోషకాలతో నిండుతుంది. చాలా సమయం కాల్చడంతో ఉప్పు బ్రౌన్ రంగులోకి మారిపోతుంది. దీన్ని ‘బాంబూ సాల్ట్’ పేరుతో అమ్ముతారు.