‘సరిపోదా శనివారం మూవీతో ఆకట్టుకున్న నేచురల్ స్టార్ నాని డిఫరెంట్ జోనర్ సినిమాలు చేస్తున్నాడు. తన 32వ సినిమాతో మరో మైల్ స్టోన్ జర్నీ ప్రారంభించబోతున్నారు. తాజాగా నాని నటించిన హిట్ (ది థర్డ్ కేస్) మూవీని అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని వాల్ పోస్టర్ సినిమా, యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు.
ఒకసారి గ్లింప్స్ చూస్తే.. హీరో నాని ఆఫీసర్ మంచు పర్వతాలలో కారు నడుపుతూ, అతనిని వెంబడిస్తున్న ఇద్దరు పోలీసు ఆఫీసర్స్‌తో ఇంట్రస్టింగ్ సీన్స్‌తో ప్రారంభమైయింది. ఆఫీసర్ డేంజర్‌లో ఉన్నారని ఒక అధికారి మరొకరు హెచ్చరించడంతో టెన్షన్ బిల్ అయింది. అయితే తను డేంజర్ లో లేడని, తనే డేంజర్ అని పోలీస్ ఆఫీసర్ చెప్పిన తర్వాత అర్జున్ సర్కార్‌గా నాని కనిపించడం టెర్రిఫిక్‌గా ఉంది.
నాని సిగార్ తాగుతూ, కారు నడుపుతూ రక్తపు చేతులు, గొడ్డలితో స్టైలిష్ అండ్ ఫెరోషియస్ గా కనిపించారు. అర్జున్ సర్కార్ క్యారెక్టర్ లో ఆదరగొట్టారు. అర్జున్ సర్కార్ క్యారెక్టర్ చాలా పవర్ ఫుల్ గా ఉండబోతోంది. హిట్ ఫ్రాంచైజీలో మోస్ట్ సక్సెస్ ఫుల్ మూవీస్ ని అందించిన డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈమూవీ మరింత ప్రతిష్టాత్మకంగా ఉండనుంది. టీజర్ సినిమా స్టైలిష్, ఇంటెన్స్, గ్రాండ్ నెస్ ని ప్రజంట్ చేస్తోంది. మిక్కీ జె మేయర్ పవర్ ఫుల్ బీజీఎం తో ఇంటెన్సిటీ పెంచారు. మే 1, 2025న వేసవిలో హిట్ 3 థియేటర్లలో విడుదల కానుందని మేకర్స్ వీడియో ద్వారా అనౌన్స్ చేశారు.