calender_icon.png 16 March, 2025 | 11:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈ నంది శిల్పం అరుదైంది

02-03-2025 12:00:00 AM

తెలంగాణలో అరుదైన శిల్పాలెన్నో ఉన్నాయి. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ పట్టణంలోని పురావస్తుశాలలో ఉన్న నంది విగ్రహానికి అరుదైన చరిత్ర ఉందని పురావస్తు పరిశోధకులు ఈమని శివనాగిరెడ్డి గుర్తించారు. గతేడాది ఢిల్లీ ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్ ‘భారతీయ ఇతిహాసం, చరిత్రలో నంది శిల్పం’ అన్న అంశంపై నిర్వహించిన జాతీయ సదస్సులో అలంపూర్ మ్యూజియంలోని ఉమామహేశ్వర శిల్పానికి సంబంధించిన పరిశోధన పత్రాన్ని సమర్పించారు. 11వ శతాబ్దం నాటి కందూరు చోళుల కాలానికి చెందిన నల్లశానపు రాతి నంది శిల్పం లాంటివి భారతదేశంలో తప్ప మరే ప్రాంతంలోనూ లేవని తెలిపారు.