07-04-2025 04:11:46 PM
ముఖ్య అతిథిగా హాజరుకానున్న కేంద్ర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు
పటాన్ చెరు: ప్రతిష్టాత్మక కౌటిల్యా స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ (కేఎస్ పీపీ) తృతీయ పట్టభద్రుల దినోత్సవాన్ని ఏప్రిల్ 16న (బుధవారం) గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ ప్రాంగణంలోని కిన్నెర్ సెమినార్ హాలులో నిర్వహించనున్నట్లు గీతం ప్రతినిధులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పబ్లిక్ పాలసీ స్నాతకోత్తర (పీజీ) డిగ్రీని పూర్తిచేసిన దాదాపు 30 మంది విద్యార్థులకు ఈ సందర్భంగా పట్టాలను ప్రదానం చేయనున్నారు. దీనికి ముఖ్య అతిథిగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు హాజరు కానున్నారు. గీతం అధ్యక్షుడు ఎం.శ్రీభరత్, కేఎస్ పీపీ సహ వ్యవస్థాపకుడు ప్రతీక్ కన్వాల్, ఉపకులపతి ఎర్రోల్ డిసౌజా, గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు, కేఎస్ పీపీ డీన్, రాయబారి సయ్యద్ అక్బరుద్దీన్, రిజిస్ట్రార్ డాక్టర్ డి.గుణశేఖరన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.