calender_icon.png 23 February, 2025 | 3:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అందుకే యూరప్‌లో పిల్లలకు రాత్రి షోలు బంద్: హైకోర్టు

19-02-2025 01:39:39 AM

హైదరాబాద్, ఫిబ్రవరి 18 (విజయక్రాంతి): రాత్రిళ్లు సినిమా ప్రదర్శనలు పిల్లలపై మానసిక ప్రభావం చూపుతాయని, అందుకే యూరప్‌లో రాత్రిళ్లు పిల్లలకు షోలు బంద్ అయ్యాయని హైకోర్టు గుర్తు చేసింది. ‘గేమ్‌చేంజర్’ చిత్రం అదనపు ప్రదర్శనలు, టిక్కెట్ ధరల పెంపునకు అనుమతిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై హైకోర్టులో దాఖలైన రెండు పిటిషన్లపైవి చారించిన సింగిల్ జడ్జి ఇటీవల పిల్లలను రాత్రి 11 నుంచి ఉదయం 11 గం టల లోపు అనుమతించొద్దని ఉత్తర్వు లు జారీ చేశారు.

తీర్పును తొలగించాలని కోరుతూ.. మల్టీప్లెక్స్ అసోసియే షన్ ఆఫ్ ఇండియా హైకోర్ట్‌లో ఇంప్లీ డ్ పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్‌పై మంగళవారం జస్టిస్ బీ విజయ్ సేన్‌రెడ్డి విచారణ చేపట్టారు. మల్టీప్లెక్స్ అసోసియేషన్ తరఫు న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డి తన వాదనలు వినిపిస్తూ.. సింగిల్ జడ్జి ఉత్తర్వులతో మల్టీప్లెక్స్ థియేటర్ యాజమాన్యాలు నష్టపోతున్నాయని, పిటిషన్లు కేవలం అదనపు షోలు, టిక్కెట్ల ధరల పెంపునకు సంబంధించిన అంశమేనని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ అంశంలో పిల్లలు చూసేందుకు అనుమతించరాదన్న అభ్యర్థన లేదన్నారు.

పిల్లలను అనుమతించే విషయంపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉందని, అందుకే ఆ నిర్ణయాన్ని ప్రభుత్వానికి వదిలి వేయాలని వాదించారు. వాదనలు విన్న న్యాయమూర్తి ఇంప్లీడ్ పిటిషన్‌ను అనుమతిస్తూనే, పిటిషన్‌పై కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించారు.  రాత్రిళ్లు సినిమాలకు వెళ్లే పిల్లలపై మానసిక ప్రభావం ఉంటుందని, అందుకే యూరప్‌లో పిల్లలకు రాత్రి సినిమా షోలు ఉండవన్నారు. పిటిషన్‌పై ఈనెల 24న విచారణ చేపడతామని తెలిపారు.