2019లో రిలీజ్ అయిన హాలీవుడ్ సినిమా ‘ది లయన్ కింగ్’ భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్‌గా ‘ముఫాసా: ది లయన్ కింగ్’ సిద్ధమైంది. దర్శకుడు బారీ జెమ్కిన్స్ డైరెక్షన్లో వాల్ట్ డిస్నీ నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 20న ఇంగ్లిష్, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో ఇండియన్ థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాలోని ముఫాసా పాత్రకు సంబంధించి తెలుగు వెర్షన్ డబ్బింగ్‌ను మహేశ్‌బాబు చెప్పారు. ప్రముఖ నటులు బ్రహ్మానందం, అలీ కూడా ఈ ప్రాజెక్టులో భాగమయ్యారు. బ్రహ్మానందం పుంబా పాత్రకు వాయిస్ అందించగా, అలీ టిమోన్ పాత్రకు గాత్రం అందించారు.
సోమవారం విడుదలైన తెలుగు ట్రైలర్ ఆకట్టుకుంటోంది. రాజుకు సంబంధించిన పురాణా గాథను రఫీకి వివరిస్తున్నట్టు ట్రైలర్లో ప్రజెంట్ చేశారు. ముఫాసా అనే ఆర్ఫన్ కబ్ను, రాజరిక వారసత్వం కలిగిన దయగల సింహం టాకాను పరిచయం చేస్తోందీ కథ. వారు ఒక అద్భుతమైన బ్యాండ్ ఆఫ్ మిస్ఫిట్లతో గొప్ప జర్నీని ప్రారంభిస్తారు. మహేశ్‌బాబు మ్యాజికల్ వాయిస్ ప్రత్యేక ఆకర్షణగా నిలవగా, బ్రహ్మానందం, అలీ స్వరాలు ప్లజెంట్‌గా ఉన్నాయి.