calender_icon.png 21 January, 2025 | 4:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విండీస్ సైన్యం ఇదే

31-08-2024 12:00:00 AM

మహిళల టీ20 వరల్డ్ కప్

ట్రినిడాడ్: అక్టోబర్‌లో దుబాయ్ వేదికగా జరగనున్న మహిళల టీ20 ప్రపంచకప్ కోసం వెస్టిండీస్ బోర్డు 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ఆల్‌రౌండర్ హేలీ మాథ్యూస్‌ను కెప్టెన్‌గా జట్టను నడిపించనుంది. ఇటీవలే రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న డియోండ్రా డాటిన్‌కు కూడా సెలెక్టర్లు అవకాశం ఇచ్చారు. ఈ సారి ప్రపంచకప్ కోసం అనుభవజ్ఞులతో పాటు యువ క్రికెటర్లతో కూడిన జట్టును ఎంపిక చేసినట్లు విండీస్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు కిషోర్ షాల్లో తెలిపాడు. వెస్టిండీస్ మహిళా జట్టు అక్టోబర్ 4న సౌతాఫ్రికా మహిళలతో మ్యాచ్ ద్వారా మెగాటోర్నీ జర్నీ ఆరంభించనుంది. 2016వ సంవత్సరంలో భారత్ ఆతిథ్యం ఇచ్చిన ప్రపంచకప్‌ను విండీస్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. 2018 ప్రపంచకప్‌లో సెమీస్ చేరిన కరేబియన్ జట్టు 2020, 2023లో మాత్రం గ్రూప్ దశలోనే ఇంటిముఖం పట్టింది.