అన్నీ ఉండి ఆటల్లో గెలుపు సాధిస్తే.. గొప్పకాదు. కరువు పీడిత గ్రామాల్లో పుట్టి.. ఏమీలేని నిరుపేద కుటుంబాల నుంచి వచ్చి.. పులి పిల్లళ్ల కుస్తీ పోటీల్లో పాల్గొని ప్రతిభ చూపుతున్న పాలమూరు బిడ్డలు. నారాయణపేట జిల్లాలోని ధన్వాడ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం. ఇక్కడ బడుగు బిడ్డలకు అక్షరాలను అందించడమే కాదు. వారి లక్ష్యాలకు కూడా రెక్కలు తొడుగుతున్నారు.
‘చదువుల బడి... ఆటల బడి’ రెండింటి కలబోతతో ఉన్న కేజీబీవీలో ఎంతోమంది అమ్మాయిలు తమకు నచ్చిన ఆటలో ముందుకు సాగుతు న్నారు. ముఖ్యంగా గతంలో పాలమూరుకు పరిచయమే లేని కుస్తీ పోటీల్లో సత్తా చాటుతున్నారు. పాలమూరు బిడ్డల దంగల్ కథ ఇది.
2018 వరకు ఇక్కడి పిల్లలకు రెజ్లింగ్ గురించి ఏమాత్రం తెలియదు. ఎందుకంటే ఆటకంటే.. బతుకుతో పోరాటం చేయడమే అతిపెద్ద సమ స్య. ఆ బతుకు పోరులో వలసపోతూ కొంద రు.. కూలీ చేసుకుంటూ కొందరు.. కడుపు నిండా నాలుగు మెతుకులు దొరుకుతాయనే ఉద్దేశంతో ఈ అమ్మాయిలను కేజీబీవీలో చేర్పించారు.
ఈ స్కూల్లోని అమ్మాయిలు చదువుతో పాటు ఆటను అందిపుచ్చుకొని ముందుకు సాగుతున్నారు. ధన్వాడ చుట్టు పక్కల గ్రామాలు, తండాల నుంచి ఎక్కువమంది విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నా రు. పిల్లల తల్లిదండ్రులు వ్యవసాయం, కూలీ పనులతో జీవనం కొనసాగిస్తున్నారు. మరికొందరు వ్యవసాయం గిట్టుబాటు కాక అమ్మాయిలను కేజీబీవీల్లో చేర్పించి.. వలస వెళ్తుంటారు.
ఇక్కడ చేరిన పిల్లలకు కూడా కోకో, కబడ్డీ గురించి తప్ప.. రెజ్లింగ్ గురించి ఏమా త్రం తెలియదు. అలాంటి సమయంలో ఉమ్మ డి మహబూబ్‌నగర్ కలెక్టర్ రోనాల్డ్ రాస్ ఈ ప్రాంతానికి రెజ్లింగ్ అకాడమీ మంజూరు చేశారు. అలా ధన్వాడలో రెజ్లింగ్ ప్రస్థానం మొదలైంది.
డబ్బుల్లేక వచ్చేశా!
మేం ఇద్దరం అమ్మాయిలం. తల్లిదండ్రులు లేరు. మా అమ్మమ్మవాళ్లే మమ్మల్ని చూసుకుంటున్నారు. నాకు రెజ్లింగ్ అనే ఆట ఉంటుందని కూడా తెలియదు. స్కూల్లో జాయిన్ అయ్యాకే తెలిసింది. స్కూల్లో చేరినప్పటి నుంచి రెజ్లింగ్ నేర్చుకోవడం మొదలు పెట్టా.. మొదట్లో కాళ్లు, చేతులు బాగా నొప్పులు వచ్చేవి.
నా వల్ల కాదని వదిలిపెట్టా.. కానీ అక్కవాళ్లు ఆడుతుంటే మళ్లీ ఇంట్రెస్ట్ కలిగింది. అలా ఏడో తరగతిలోనే మధ్యప్రదేశ్, ఢిల్లీ, హర్యానాలో ఆడి మోడ ల్స్ సాధించా. ఢిల్లీలో ఎలిషియన్ ట్రైయల్స్‌లో రెండుసార్లు ఆడాను. హైదరాబాద్‌లో జరిగిన యస్.జీ.ఎఫ్ రెజ్లింగ్ చాపింయన్‌షిప్‌లో ఆడి కాంస్య పతకం సాధించా.
ఢిల్లీలో జాతీయ స్థాయిలో జరిగే యస్.జి.యఫ్ రెజ్లింగ్ చాపింయన్‌షిప్‌కు ఎంపికయ్యా.. డిసెంబర్ 1 వరకు జరుగుతాయి. ఇప్పటి వకు ఐదు మోడల్స్ సాధించా. నేషనల్ లెవల్లో సెలక్ట్ అయ్యా.. కానీ డైట్‌కు, కాస్ట్యూమ్స్‌కు డబ్బులు లేక స్కూల్‌కు వచ్చేశా. బాలమణి, మందిల్లికొత్త తండా
15 నిమిషాల్లో ఐదు వందల డిప్స్!
మా అమ్మనాన్న ముంబైలో కూలీ పని చేస్తున్నారు. మేం ముగ్గురం ఒక అన్న, తమ్ముడు ఉన్నారు. నాకు ఈ ఆట గురించి ఎనిమిదో తరగతిలో తెలిసింది. మొదట్లో ఈ ఆట చాలా కష్టంగా అనిపించింది. ఆట గురించి పూర్తి గా తెలుసుకున్నాక ఆసక్తి కలిగింది. అలా రాష్ట్ర స్థాయిలో చాలాసార్లు ఆడి మోడల్స్ సాధించాను. తర్వాత జాతీయ స్థాయిలో ఏషియన్ కుస్తీ పోటీల్లో ఆడాను.
2023 అయోధ్యాలో జరిగిన నేషనల్ లెవల్లో ఆడి కాంస్య పతకం కొట్టాను. ఢిల్లీ ఎలిషియన్ ట్రైయల్‌లో రెండుసార్లు పాల్గొన్నా. ఉత్తర్‌ప్రదేశ్‌లో మీరట్‌లో అండర్ 19లో ఆడి జాతీయ స్థాయిలో ఎనిమిదో ర్యాంకులో నిలిచాను. ప్రస్తుతం హర్యానాలో ట్రైయినింగ్ తీసుకుంటున్నా.. ఉదయం 5 గంటల వరకు.. మళ్లీ సాయంత్రం 4 వరకు ప్రాక్టీసు ఉంటుంది. కుస్తీల్లో టెక్నిక్స్ నేర్పిస్తారు.
రోజుకు 15 నిమిషాల్లో ఐదు వందల డిప్స్ కొట్టాలి. మా ప్రత్యేకమైన డైట్ ఉంటుంది. పాలు, బాదం, కిస్‌మిస్, పెరుగు, క్యారెట్స్, పల్లీలు ఇస్తారు. ఇక్కడ వాతావరణం చల్లగా ఉంటుంది. మన తెలంగాణ నుంచి ముగ్గురం ట్రైయినింగ్ తీసుకుంటున్నాం. ఇంటర్నెషనల్ స్థాయిలో ఆడి.. విజయం సాధించి మన దేశానికి మంచి పేరు తీసుకురావాలని నా కోరిక.
గీత, అక్మారి తండా
చిరిగిపోయిన ట్రాక్‌ను కుట్టుకొని..
మా అమ్మనాన్న కూలీ పని చేస్తారు. మా మాస్టారు, టీచర్స్ అందరు మమ్మల్ని బాగా ప్రోత్సహిస్తున్నారు. ఈ ఆట గురించి తెలుసుకున్నా.. బాగా ఆడి.. మోడల్స్ సాధించాలని నిర్ణయించుకున్నా. జిల్లా స్థాయిలో మూడు సార్లు ఆడి.. మూడు గోల్డ్ మోడల్స్ సాధించా. స్టేట్ లెవల్లో కూడా మూడు పతకాలు సాధించా.. జాతీయ స్థాయిలో రెండుసార్లు ఆడాను. రెజ్లింగ్ ఆడాలంటే మంచి ఆహారం అవసరం ఉంటుంది.
ఆడటానికి విశాలమైన స్థలం.. ప్రత్యేకంగా రెజ్లింగ్ మ్యాట్ ఉండాలి. ఇవన్నీ వసతులు ప్రభు త్వం కల్పిస్తే.. భవిష్యత్త్‌లో ఒలంపింక్‌లో పాల్గొని దేశానికి మంచి పేరు తీసుకొస్తాం. వేరే రాష్ట్రాల్లో పోటీల్లో పాల్గొందుకు వెళ్లినప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. మాకు సరైన షూ, ట్రాక్స్ ఉండవు. స్కూల్లో ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా ఒక్కటే డ్రస్ ఉండటం వల్ల చిరిగిపోతే మళ్లీ అదే కుట్టుకొని వేసుకోవాలి.
మౌనిక, నల్లకుంట తండా
దేశానికి పేరు తేవాలనేదే..
మాది ధన్వాడ మండలం మందిపల్లి పాతతండా. ముగ్గురు అమ్మాయి లు, ఒక అబ్బాయి. హైదరాబాద్‌లో ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నా. ఇద్దరమ్మాయిల ను కేజీబీవీలో చదివిస్తున్నాను. నా పిల్ల లు స్కూల్లో చదువుతున్నప్పుడే స్పోర్ట్స్ అకాడమీ మంజూరైంది. ఇద్దరమ్మాయిలను కుస్తీ విభాగంలో చేర్పించా..
అప్ప టి నుంచి మా పిల్ల్లలిద్దరూ స్టేట్, నేషనల్ లెవల్లో గోల్డ్, సిల్వర్, కాంస్య పతకాలు సాధించా రు. నాతో చాలామంది అంటున్నారు.. ‘పెళ్లి చేస్తే వెళ్లిపోయే అమ్మాయిలు.. ఇంత అవసర మా.. అప్పు తీర్చుకో.. గుడిసెలో ఉంటున్నావు. ఇల్లు కట్టుకో’ అంటున్నారు. అలాంటి మాట లు విన్నప్పుడు బాధేస్తుంది.
వారి మాటలు పట్టించుకోకుండా ఇద్దరమ్మాయిలను హర్యానా కు పంపించా.. అక్కడే కుస్తీలో ట్రైయినింగ్ తీసుకుంటున్నారు. వారి పోషణకు, ఫీజుకు నాకు నెలకు 30 వేల వరకు అవుతుంది. ఒలింపిక్స్‌లో ఆడి దేశానికి మంచి పేరు తేవాలనేదే నా కోరిక. మా తండా నుంచి ఆడటం ఇదే మొదటిసారి.
బాల్ సింగ్, మందిపల్లికొత్త తండా
సరైనా ఆహారం అందడం లేదు..
ఆరు నెలల ట్రైనింగ్ తర్వాత.. మొదటి ప్రయత్నంలోనే మనకు చాంపియన్ షిప్ వచ్చింది. అలా చాంపియన్‌షిప్ వచ్చినప్పటి నుంచి పిల్లల్లో రెజ్లింగ్ పట్ల ఆసక్తి బాగా పెరిగిం ది. మెదక్ జిల్లాలో అండర్-14 జరిగినప్పుడు మోడల్స్ సాధించారు. అలా సౌత్ జోన్ నుంచి ఆరు, ఏడు మంది అమ్మాయిలు జాతీయ స్థాయికి ఎంపికయ్యారు.
దాంట్లో ముగ్గురు కాంస్య పతకం, ఇంకో ముగ్గురు సిల్వర్ మోడ ల్ సాధించారు. మన దగ్గర నుంచి సౌత్ ఏషియన్‌కు ఆడటానికి వెళ్లారు. పిల్లల డైట్‌కు డబ్బుల అవసరం ఉంటుంది. రెజ్లింగ్‌కు డ్రస్ కోడ్ అనేది ప్రత్యేకంగా ఉంటుంది. అదికూడా పిల్లలకు ఒక్కటే జత ఉండటం వల్ల ఉదయం, సాయంత్రం అదే వేసుకోవాల్సి వస్తుంది.
పిల్లలకు మామూలు మ్యాట్ మీద రెజ్లింగ్ నేర్పి స్తున్నా. వసతులు సరిగ్గా లేకపోయినా.. పిల్లల్లో ఉన్న ఆసక్తితో.. ఆడిన ప్రతిసారి మోడల్స్ తీకొస్తున్నారు. పిల్లలకు సరిగ్గా డైట్ అందడం లేదు. అది కరెక్ట్‌గా ఉంటే పిల్లలు ఇంకా ముందుకెళ్లగలుతారు. ప్రభుత్వం నుంచి పిల్లలకు సరైన ప్రోత్సాహం లభిస్తే.. ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు.
శ్రీనివాస్ నాయక్, రెజ్లింగ్ కోచ్, ధన్వాడ