calender_icon.png 26 October, 2024 | 10:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇది మన అందరి కథ

05-07-2024 12:05:00 AM

నివేతా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ ప్రధాన పాత్రల్లో నంద కిషోర్ ఈమాని రచన, దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘35 చిన్న కథ కాదు’. ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్‌ని చిత్ర సమర్పకులైన రానా విడుదల చేశారు. కుటుంబ భావోద్వేగాలతో ఆద్యంతం హృద్యంగా సాగిన ఈ టీజర్‌లో తొలిసారి తల్లి పాత్రలో నటించిన నివేత అభినయం కట్టిపడేసేలా ఉంది. తిరుపతి పరిసరాల్లో జరిగిన కథగా ఈ సినిమా ఆగస్టు 15న తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.

టీజర్ విడుదల కార్యక్రమంలో రానా మాట్లాడుతూ ‘స్కూల్‌లో ఉన్నప్పుడు 35 అనేది నాకు పెద్ద పర్వతం లాంటింది. నందు ఈ కథ చెప్పినపుడు నాకు నేను గుర్తుకు వచ్చాను, మా అమ్మ గుర్తుకొచ్చింది. నా కోసం ఆమె పడిన కష్టం గుర్తుకొచ్చింది. ఈ కథ వెళ్లి మా అమ్మకు చెప్పాను. ఇది మన అందరి కథ. ఇలాంటి స్వచ్ఛమైన కథలు సురేష్ ప్రొడక్షన్స్‌లో చేయాలనేది మా ఉద్దేశం’ అని అన్నారు. ‘నా కెరీర్‌లో బెస్ట్ అంతా రామానాయుడు స్టూడియోస్‌లోనే జరిగింది. బ్రోచే సినిమా కూడా ఇక్కడే జరిగింది. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నాకు మొదట పరిచయమైయింది రానా గారు.

35-చిన్న కథ కాదు నా కెరీర్‌లో చాలా స్పెషల్ ఫిల్మ్’ అని నివేతా థామస్ అన్నారు. అనంతరం నిర్మాత సృజన్ యరబోలు మాట్లాడుతూ “సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా రానా గారు ఈ సినిమాని మరో స్థాయికి తీసుకెళతారు. సినిమా చూశా క ఇది చిన్న సినిమ కాదు చాలా పెద్ద సినిమా అని అందరూ అంటారు” అన్నారు.