మీరు ఎప్పుడైనా ఓక్రా వాటర్ గురించి విన్నారా? ఇటీవల ఈ పదం తెగ ట్రెండ్ అవుతున్నది. సోషల్ మీడియాలో దీని గురించి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నది. ఓక్రా వాటర్‌తో కలిగే ప్రయోజనాలు ఏంటి? ఇంతకీ ఓక్రా వాటర్ అంటే ఏమిటి? ఈ నీళ్లు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం..
ఓక్రా వాటర్ అంటే మరెంటో కాదు.. బెండకాయలు నానబెట్టిన నీరు. ఇందుకోసం ముందుగా బెండకాయలను అడ్డంగా ముక్కలు చేసి నీటిలో నానబెట్టాలి. ఈ ముక్కలను నీటిలో ఎనిమిది గంటల నుంచి 12 గంటల వరకు నీటిలో నానబెట్టి తర్వాత నీటిని తాగాలి. రాత్రంతా నానబెట్టి ఉదయం తాగడం వల్ల ప్రయోజనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఓక్రా వాటర్‌లో రుచి కోసం కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి వేసుకుంటే బాగుంటుంది.
ఉపయోగాలు..
* ఓక్రా వాటర్‌లో విటమిన్-ఏ, విటమిన్-సీ, విటమిన్-కేలతో పాటు పొటాషియం, మెగ్నీషియం, కాల్షి యం పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
* ఓక్రా వాటర్‌ను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల పేగుల కదలికలను మెరుగు చేస్తుంది. ఎముకల అరుగుదల సమస్యలు రాకుండా, మలబద్దకం దరిచేరకుండా కాపాడుతుంది. ఇందులో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది.
* ఈ నీటిని క్రమం తప్పకుండా తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. ఇన్సులిన్ అదుపులో ఉండని వారు, డయాబెటిస్‌తో బాధపడే వారు ఈ నీటిని క్రమం తప్పకుండా తాగితే మంచి ఫలితం ఉంటుంది.
* గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా ఈ నీరు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉండే పాలీఫెనాల్స్, ఫ్లేవనాయిడ్స్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
* చర్మ ఆరోగ్యాన్ని కాపాడడంలో ఓక్రా వాటర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులోని విటమిన్ యాంటీ ఆక్సిడెంట్స్ చర్మాన్ని ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షించడమే కాకుండా.. హానికరమైన టాక్సిన్ల ఉత్పత్తిని తగ్గించి చర్మాన్ని మరింత అందంగా, ఆరోగ్యంగా మారుస్తుంది.
* శరీరంలో పేరుకుపోయే విష పదార్థాలను తొలగించడంలో బెండకాయ నీరు కీలక పాత్ర పోషిస్తాయి. తరచుగా ఓక్రా నీటిని తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.