11-03-2025 12:32:37 AM
మేడ్చల్, మార్చి 10 (విజయ క్రాంతి): మున్సిపాలిటీలలో పాలన గాడి తప్పింది. పాలకవర్గాల పదవీ కాలం ముగిసిన తర్వాత ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమిం చింది. ఎక్కడో ఉన్న అధికారులకు మున్సిపాలిటీల బాధ్యతలు అప్పగిం చడంతో వారు బల్దియ కార్యాల యాల వైపు కన్నెత్తి చూడడం లేదు.
పాలకవర్గాలు ఉన్న సమయంలో పట్టణాల్లో ఏదైనా సమస్యలు తలెత్తితే వెంటనే పరిష్కారం అయ్యేది. ప్రజలు కౌన్సిలర్ కు లేదా చైర్మన్ లకు సమస్యలను వివరించేవారు. ప్రస్తుతం వారు లేకపోవడంతో సమస్యలు పరిష్కరించేవారు కరువయ్యారు. మేడ్చల్ పట్టణంలో బస్టాండ్ ఎదురుగా కొంతకాలంగా డ్రైనేజీ నీళ్లు జాతీయ రహదారి మీద ప్రవహిస్తున్నాయి.
దీనివల్ల దుర్గంధం వ్యాపించడమే గాక పాదాచారులకు ఇబ్బందిగా తయారైంది. దీనిపై మున్సిపాలిటీలో వివరించినప్పటికీ పట్టించుకునే వారు లేరు. ఇప్పటికైనా డ్రైనేజీ నీళ్లు రోడ్డుమీదకు రాకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.