భార్యాభర్తలు తిట్టుకోవడం సాధారణమే. కుటుంబంలో కొట్లాటలు, కలిసి పోవడాలు చూస్తూనే ఉంటాం. అయితే భార్యాభర్తల మధ్య గొడవలకు ప్రధాన కారణం మాత్రం ‘డబ్బు’. డబ్బు సరిపోకపోవడం అనేది భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చేలా చేస్తుంది. భార్య అంచనాలు ఒకలా ఉంటే.. భర్త సంపాదన మరోలా ఉంటుంది. నిజానికి అన్ని సమస్య లకు డబ్బే కారణం అను కుంటారు.. కానీ డబ్బు కార ణం కాదు.
మనం సంతృ ప్తిగా బతకలేపోవడమే అస లైన కారణం. ఎంత డబ్బు లు వచ్చినా కూడా సంతృ ప్తిగా బతికేవారు ఎంతో మంది ఉన్నారు. కేవలం కోట్లు సంపాదించే వాళ్లే కాదు, నెలకు పదివేలు సంపాదించే వాళ్లు కూడా సంతోషంగా జీవిస్తున్నారు. అంటే మారా ల్సింది మన సంపాదన కాదు, మన ఆలోచన. ఈ విషయం చాలా మందికి తెలియక నిత్యం గొడవలు పడుతూ ఉంటారు.