calender_icon.png 10 January, 2025 | 3:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

ఇదీ.. సర్కారు బడుల దుస్థితి!

05-01-2025 12:00:00 AM

  • ప్రభుత్వ పాఠశాలలపై పర్యవేక్షణ కరువు 
  • సమయానికి రారు..సమయానికి పోరు
  • విధులకు ఎగనామం..
  • ప్రైవేట్ వ్యక్తులతో విద్యాభోదన

  • పెబ్బేరు, జనవరి 4 : సమాజంలో తల్లి దండ్రుల తర్వాత విద్యార్థులకు ఉపాధ్యా యుల పాత్ర అత్యంత కీలకమైనది. ఒక విద్యార్థి భావితరాలకు మార్గ నిర్దేశకులుగా నిలబడాలంటే ఉపాధ్యాయులు లేనిది ఏదీ సాధ్యం కాదు. కానీ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే పంతుల పరిస్థితి అధ్వానంగా మారిందని చెప్పడానికి ఇది నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంది.

  • పెబ్బేరు మున్సిపాలిటీలోని చెలిమిల్ల ప్రభుత్వ పాఠశాల ప్రధానోపా ధ్యాయులు ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్లుతారో ఎవ్వరికి తెలియదనే ఆరోపణలు ఉన్నాయి. చిన్న పార్క్ ఆవరణంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో  7మంది విద్యార్థుల కు ఒక ఉపాధ్యాయునియమించారు. పాఠ శాల సమయానికి వస్తారు తర్వాత ఇంటికి వెళ్లే సమయానికి పాఠశాలకు వస్తారనే విమర్శలు ఉన్నాయి.

  • మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రార్థనకు హాజరు కానీ వారు చాలా మంది ఉపాధ్యాయు లున్నారు. ప్రతినిత్యం గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే ఉపాధ్యాయులు సుదూర ప్రాంతా లైన మహబూబ్ నగర్, వనపర్తి, కొత్తకోట లాంటి పట్టణ కేంద్రాల్లో నివాసం ఉంటూ నెలకు 25 రోజులే కొనసాగే పాఠశాలలకు కూడా సక్రమంగా వచ్చి విద్యాబోధన చేసే పరిస్థితి కొరవడిందని విద్యార్థుల తల్లిదం డ్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

  • పెబ్బే రు మండలంలో 21 గ్రామ పంచాయతీల లో 43 ప్రభుత్వ పాఠశాలలో 94మంది టీచర్లు విధులు నిర్వహిస్తున్నారు. పాఠశా  లలు ఉదయం ప్రారంభం నుంచి సాయం త్రం వరకు సమయపాలన పాటించకుండా నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. ఉపాధ్యాయులు ఉదయం లేటుగా వచ్చి మళ్లీ సాయంత్రం బస్సు వెళ్లిపోతుందని భయంతో మళ్ళీ గంట ముందు ఇంటి బాట పడుతున్నారు.

  • చాలామంది ఉపాధ్యా యులు నెలల కనీసం 15 రోజులు కూడా సక్రమంగా పాఠశాలకు సమయానికి వచ్చి వెళ్లిన దాఖలాలు ఉండవంటే అతిశయోక్తి కాదేమో. పెబ్బేరు మండలంలోని పిఎస్ 32, యుపిఎస్ 02, జెడ్ పి హె ఎస్ 09, కేజీబీవీ, మహాత్మా జ్యోతి రావు పూలే బాలికల గురుకుల పాఠశాల, తెలంగాణ మోడల్ స్కూల్ మొత్తం 46 కొనసాగు తున్నాయి.

  • మండలంలోని చిన్న గుమ్మ డం, గుమ్మడం తాండ, జనుంపల్లి గ్రామా లలో విద్యార్థులు లేకపోవడంతో ప్రభుత్వ పాఠశాలలు మూత పడ్డాయి. పెబ్బేరు మం డలంలో సుమారు 94మంది ఉపాధ్యా యులకు లక్షలాది రూపాయల వేతనం ఇచ్చిన, అపార అనుభవం ఉన్న ఉపాధ్యా యులు పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రుల మనసులను మాత్రం దోచుకోలేకపోతున్నారు. పెబ్బేరు మున్సిపాలిటీలో కొందరు ప్రభుత్వ ఉపా ధ్యాయులకు బదులుగా ప్రైవేట్ వ్యక్తులచే విద్యార్థులకు పాఠలు చెప్పిస్తూ వారు పాఠ శాలకు డుమ్మా కొడుతున్నారనే ఆరోపణ లు వినిపిస్తున్నాయి.

ప్రభుత్వ పాఠశాలలకు దీటుగా ప్రైవేటు పాఠశాలలు..

మండలంలోని 46 ప్రభుత్వ పాఠశాల ల్లో సుమారు 3,864 మంది విద్యార్థులు చదువుతుండగా, కేవలం 20 ప్రైవేట్ పాఠ శాలలో మాత్రం 4,200 మంది విద్యార్థుల విద్యాభ్యాసం కొనసాగుతుందంటే ఏ స్థాయిలో ప్రైవేటు పాఠశాలలపై మక్కువ పెరిగిందో చెప్పనక్కర లేదు.

హాస్టళ్లపై తల్లిదండ్రుల మక్కువ..

గ్రామీణ ప్రాంతాలలోని ప్రతి పల్లెలో మారుమూల ప్రాంతాల్లో కూడా ప్రభుత్వ పాఠశాల భవనాలు ఉన్న, పంతులు సక్రమంగా రాకపోవడం వల్లే నేడు గ్రామీణ విద్యావ్యవస్థ కుంటూ పడింది.

ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు మా పిల్లవాడు ఉన్నత చదువులు చదువుకొని ఏదో ఒక ఉద్యోగం చేసుకొని తన కాళ్ళపై తాను నిలబడి బతకాలని,రాత్రనకా పగలనకా కష్టపడి కూలి నాలి చేసి సంపాదించిన డబ్బు మొత్తం తమ పిల్లల చదువులకే అత్య ధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. కాస్త ఆర్థికం గా ఉన్న కుటుంబాల వారు ప్రైవేటు పాఠశాలల్లో చదివిస్తున్నారు.

ఆర్థికంగా లేని కుటుంబాల వారు మాత్రం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశా లలో చదివించడానికి మక్కువ చూపుతు న్నారు. రాష్ర్టంలో ఇటీవల అందుకే రెసిడెన్షియల్ పాఠశాలలపై తల్లిదండ్రుల ఆదరణ ఊహించని రీతిలో పెరిగింది.

తప్పుచేస్తే ఉపేక్షించేది లేదు..

ఉపాధ్యాయ వృత్తిలో ఉండి తప్పు చేస్తే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదు. విధులకు డుమ్మాలు కొట్టె వారి పట్ల శాఖ పరమైన చర్యలు తీసుకుం టా. ప్రభుత్వ ఉపాధ్యాయులకు బదు లుగా ప్రైవేట్ వ్యక్తులతో పాఠాలు చెప్పి స్తున్న విషయం నా దృష్టికి రాలేదు. విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటా..

 జయరాములు, ఎంఈఓ, పెబ్బేరు