calender_icon.png 2 February, 2025 | 3:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డిస్ట్రిబ్యూటర్లు తలెత్తుకునేలా చేసిన సినిమా ఇది

02-02-2025 12:55:32 AM

సంక్రాంతికి వస్తున్నాం డిస్ట్రిబ్యూటర్స్ గ్రాటిట్యూడ్ మీట్

విక్టరీ వెంకటేశ్ కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో మోస్ట్ సక్సెస్ ఫుల్ బ్యానర్ శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై వచ్చిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించారు. జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం రికార్డ్ బ్రేకింగ్ హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో పొంగల్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని, ఇంకా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.

ముఖ్యంగా ఈ సినిమా తమకు అధిక మొత్తపు లాభాలు తెచ్చిపెట్టిందంటూ డిస్ట్రిబ్యూటర్లు గర్వంగా చెప్పుకొంటు న్నారు. ఈ నేపథ్యంలోనే ఇండస్ట్రీలో తొలిసారి ‘డిస్ట్రిబ్యూటర్ల ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్ లో సక్సెస్ మీట్ నిర్వహించారు. ‘డిస్ట్రిబ్యూటర్స్ గ్రాటిట్యూడ్ మీట్’ పేరుతో ఏర్పాటుచేసిన ఈ సమావేశానికి చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ‘నా కెరియర్‌లో ఇది ఒక మిరాకిల్. ఈ సినిమా సక్సెస్‌లో మేజర్ క్రెడిట్ హీరో వెంకటేశ్‌కి దక్కుతుంది. నిర్మాత హ్యాపీగా ఉండాలనే టార్గెట్ పెట్టుకుని సినిమాను తీస్తుంటాను. ఎస్‌వీసీ.. ఎన్నో గొప్ప సినిమాలు తీసిన బ్యానర్. ఆ బ్యానర్ కొన్ని తరాల పాటు ఉండాలి, ఉంటుంది. డిస్ట్రిబ్యూటర్స్ ఈవెంట్ చేయడం చాలా ఆనందంగా ఉంది.

ఈ సంవత్సరం సంక్రాంతి డిస్ట్రిబ్యూటర్స్‌కి మెమరబుల్ అయింది. ఈ సినిమా ద్వారా నేనెప్పుడూ వినలేను, చూడలేనేమో అనుకునే రెండు జరిగాయి. ౬ రోజుల్లో 100 కోట్లు షేర్ కొట్టింది. రీజినల్ ఫిలింకి చూడలేనేమో అనుకున్న. 300 గ్రాస్ నెంబర్ చూడబోతున్నాను. చాలా హ్యాపీగా ఉంది. నెక్స్ట్ చేయబోయే సినిమాలకు చాలా బాధ్యత పెరిగింది. ప్రేక్షకులకు వినోదం పంచడానికి ఎప్పుడూ ముందుంటాను’ అన్నారు.

నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. ‘సాధారణంగా డిస్ట్రిబ్యూటర్లకు బ్రేక్ ఈవెన్ అయితేనే సూపర్ హిట్ అని చెప్పుకునే పరిస్థితి నెలకొంది. వాళ్లు నష్టపోయినప్పుడు కూడా సినిమా సూపర్ హిట్ పోస్టర్స్ పడుతుంటాయి. కల్చర్ మారిపోయింది. 90 శాతం ఫెయిల్యూర్స్ ఉండే ఇండస్ట్రీ ఇది. జస్ట్ 10 శాతమే సక్సె స్. మా డిస్ట్రిబ్యూటర్స్ సక్సెస్ ఫెయిల్యూర్స్ అన్నిటిని తట్టుకుని మాతో జర్నీ కంటిన్యూ చేస్తున్నారు.

20 ఏళ్ల పాటు ఒక ప్రొడ్యూసర్‌తో డిస్ట్రిబ్యూటర్స్ కంటిన్యూ అవ్వడం అనేది ఇండస్ట్రీలో చాలా అరుదు. బడ్జెట్ కాదు కథలే ఇంపార్టెంట్. కాంబినేషన్స్ అంటూ నాలుగైదేళ్లుగా తడబడుతున్నాం. అనిల్ మళ్లీ మాకు రూటు చూపించారు. సంక్రాంతికి వస్తున్నాం సక్సెస్‌తో ఒక రహదారి వేసి ఇచ్చా డు. మా సంస్థ నుంచి అద్భుతమైన సినిమాలు రావడానికి ఇది బిగ్ ఎనర్జీ. ఈ సక్సెస్ నాకు చాలా పాఠాలు నేర్పించింది’ అన్నారు.

నిర్మాత శిరీష్ మాట్లాడుతూ.. “20 ఏళ్ల క్రితం డిస్ట్రిబ్యూటర్‌కున్న విలువ ఇప్పుడు లేదు. ఇలాంటి సమయంలో డిస్ట్రిబ్యూటర్ తలెత్తుకునేలా చేసిన సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’. నిజాయితీగా ఈ సినిమా ఇంత చేసింది అని తలెత్తుకుని చెప్తున్న సభ ఇది” అన్నారు. డిస్ట్రిబ్యూటర్లు ఎల్వీఆర్, సాయికృష్ణ, రాజేశ్, హరి, శోభన్ తదితరులు పాల్గొన్నారు.