calender_icon.png 1 November, 2024 | 7:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇదో మాయా గోడ!

29-07-2024 01:57:28 AM

  1. పురుగు కూడా దాటనివ్వని వాలాన్స్ లైన్
  2. ఇండోనేషియాలో ప్రకృతి రహస్యం
  3. చేపలు కూడా దాటలేని కనిపించని గోడ

న్యూఢిల్లీ, జూలై 28: భూమిపై మనకు తెలియని అనేక వింతలు విశేషాలు ఉన్నాయి. ఎంత షోధించినా ఇంకా కొత్త విషయాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. వెలుగు చూస్తూ నే ఉంటాయి. అలాంటి వింతల్లో వింత ఒకటి ద్వీపాల దేశం ఇండోనేషియాలో ఉన్నది. దానిపేరే వాలాన్స్ లైన్. ఇది జంతు, పక్షిజాలానికి పెట్టని అడ్డుగోడ. కనిపించని మాయా గోడ. ఈ గోడను సముద్రంలో ఈదే చేపలుగానీ, భూమిపై ఉండే జంతువులుగానీ, ఆఖరికి ఆకాశంలో ఎగరే పక్షులుగానీ దాటలేవు. ఇలా ఎందుకు జరుగుతున్నది అనే అంశంపై శాస్త్రవేత్తలు కొన్నేండ్లపాటు పరిశోధనలు చేశారు. చివరకు కారణాన్ని కనుగొన్నారు. 

బడబాగ్ని వల్లనే..

బాలికి, లంబాక్‌కు మధ్య దాదాపు 35 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మధ్యలో సముద్రం ఉంటుంది. ఈ సముద్ర పాయను నీటిలో ఉండే చేపలతోపాటు ఆకాశంలో ఎగరే పక్షులు కూడా దాటవు. నిజానికి చేపలకు సముద్రమంతా ఆవాసమే. కానీ, ఈ లైన్‌ను దాటకపోవటానికి కారణంపై పరిశోధనలు చేయగా, అక్కడ నీరు అసాధారణ స్థాయిలో వేడిగా ఉన్నట్టు గుర్తించారు. ఇండోనేషియాలో చాలాదీవులు అగ్నిపర్వత ఉద్బేదనాలే. సముద్రం అడుగుభాగంలో లావా ప్రవాహాలు ఉంటాయి. దీంతో ఆ వేడికి నీరు వేడెక్కుతున్నదని, అందువల్లనే చేపలు ఆ నీటిలోకి రావటంలేదని తేల్చారు. ఇక పక్షులను మరో కథ. ఈ దీవుల్లో ఉండే పక్షులు చాలాదూరం ఎగరలేవు. సముద్రం మధ్యలోనే ఉన్నా.. వాటి శరీరాకృతి 2 కిలోమీటర్లకంటే దూరం ఎగిరేందుకు వీలుగా పరిణామం చెందలేదు. అందుకే ఇక్కడి పక్షులు ఆకాశంలో ఎగరలేవని, ఈ లైన్‌ను దాటలేవని పర్యావరణవేత్తలు గుర్తించారు. 

శాస్త్రవేత్త పేరే..

ఇండోనేషియాను రెండు చీల్చుతున్న వాలాన్స్ లైన్‌ను 160 ఏండ్ల క్రితం బ్రిటీష్ పర్యావరణవేత్త ఆఫ్ల్రెడ్ రస్సెల్ వాలాన్స్ గుర్తించారు. ఆయన జీవ పరిణామ సిద్ధాంతకర్త చార్లెస్ డార్విన్‌కు సమకాలీకుడు. డార్విన్‌లాగే భూమిపై ఉన్న జీవ వైవిద్యంపై పరిశోధనలు చేశారు. ఆయన పేరుమీదనే ఈ వింతకు వాలాన్స్ లైన్ అనే పేరు వచ్చింది.  ఇండోనేషియాలోని బాలి, లంబాక్ మధ్య కంటికి కనిపించని ఈ వింతపై అనేకమంది ఏండ్లపాటు పరిశోధనలు చేశారు. ఈ రెండు దీవుల మధ్య సముద్రాన్ని చేపలు, జంతువులు, పక్షులు కూడా అటు ఇటు దాటకపోవటాన్ని వాలాన్స్ మొదట గుర్తించారు.