20-03-2025 12:11:56 AM
గద్దర్ అవార్డుల దరఖాస్తులకు సంబంధించి రాష్ట్ర ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 20న (నేడు) మధ్యాహ్నం 3 గంటల వరకే అప్లికేషన్లు అందుబాటులో ఉంటాయని, 22న (శుక్రవారం) మధ్యాహ్నం 3 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని వెల్లడించింది. ఫీచర్ ఫిల్మ్, డాక్యుమెంటరీ ఫిల్మ్, షార్ట్ ఫిల్మ్, బుక్స్-క్రిటిక్స్ విభాగాల్లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు పేర్కొంది.
‘ది మేనేజింగ్ డైరెక్టర్, తెలంగాణ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్’ పేరిట చెక్ రూపంలో గానీ డీడీ రూపంలో గానీ ప్రవేశ రుసుం చెల్లించాలని సూచించింది. ఎంట్రీ, అప్లికేషన్ రుసుం వివరాలిలా ఉన్నాయి.. ఫీచర్ ఫిల్మ్ ఎంట్రీ ఫీజును రూ.11,800గా నిర్ణయించిన ఎఫ్‌డీసీ.. డాక్యుమెంటరీ, షార్ట్ ఫిల్మ్స్‌కు రూ.3,540లు ప్రవేశ రుసుముగా నిర్ణయించింది.
ఇక బుక్స్‌అండ్ క్రిటిక్స్ విభాగంలో పోటీపడేవారు రూ.2,360లు ప్రవేశ రుసుముగా చెల్లించాల్సి ఉంటుంది. అన్ని విభాగాల్లో అప్లికేషన్లకు రుసుం రూ.5,900 వసూలు చేయనున్నట్టు పేర్కొన్నారు. ఈ ఫీజులన్నీ జీఎస్టీతో కలిపి నిర్ణయించినవే.. అంటే ప్రత్యేకంగా జీఎస్టీ చెల్లించాల్సి అవసరం లేదు.