calender_icon.png 25 November, 2024 | 6:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇది రాజుగారి ప్యాలెస్

25-11-2024 12:00:00 AM

జైపూర్ నగరం దేశంలోనే అత్యంత సాంస్కృతిక వారసత్వ సంపద కలిగిన నగరాలలో ఒకటి. అలాంటి జైపూర్ చుట్టూ సాంస్కృతిక వారసత్వం, అందమైన దృశ్యాలు అనేకం కనిపిస్తాయి. అలాం టి అద్భుత దృశ్యాలకు నెలవు సమోద్ గ్రామం. దేశీయ, విదేశీ పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తుంది ఈ గ్రామం. సమోద్ గ్రామం చాలా పురాత న వారసత్వాన్ని కలిగి ఉంటుంది.

16వ శతాబ్దంలో రావల్ మహారాజ్ ఈ కోటను స్థాపించారు. అప్ప టి నుంచి ఈ గ్రామం, కోట చరిత్ర మొదలైందని పరిశోధకులు చెబుతారు. ఈ కోట సమోద్ గ్రామానికి ప్రత్యేక ఆకర్షణ. ఈ గ్రామంలో సినిమా షూటింగ్‌లు కూడా జరుగుతుంటాయి. 

హనుమాన్ ఆలయం.. జైపూర్ నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న సమోద్ గ్రామానికి సమీ పంలో హనుమాన్ ఆలయం ఉంటుంది. ఇది స్థానికంగా అత్యంత ప్రాచ్యురం చెందిన ఆలయం. ఈ ఆలయంలో సుమారు ఆరు అడుగుల ఎత్తున హనుమంతుడు 700 సంవత్సరాల క్రితం రాతి నుంచి ప్రత్యక్షమయ్యాడని నమ్ముతారు స్థానికులు. ఇక్కడికి వచ్చిన వారి ప్రతి కోరిక నెరవేరుతుందని స్థానికుల నమ్మకం.

సమోద్ గ్రామంలోని ప్యాలెస్ హెరిటేజ్ హోటల్‌గా మార్చబడింది. ఇందులో బస చేయడం ఒక రాచరిక అనుభవం. అది కాకుండా సమోద్ శీష్ మహల్ కూడా చాలా అందంగా ఉంటుంది. గోడలపై ఉండే సంప్రదాయ పెయింటింగ్స్, ఆర్కిటెక్చర్ డిజైన్లు పర్యాటకులను ప్రత్యేకంగా ఆకర్షిస్తాయి.