13-04-2025 12:05:48 AM
జాన్వీ కపూర్ నిరుడు ‘దేవర’తో మంచి విజయాన్ని అందు కుంది. ప్రస్తుతం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ‘పెద్ది’ చిత్రంలో రామ్‌చరణ్‌కు జోడీగా నటికస్తోంది. ఇదిలా ఉండగా.. హైదరాబాద్‌కు చెందిన నీరజ్ ఘైవాన్ దర్శకత్వంలో ఇషాన్ ఖట్టర్, జాన్వీకపూర్ నటించిన ‘హోమ్‌బౌండ్’ చిత్రం ప్రతిష్టాత్మక కేన్స్ అంతర్జాతీయ చిత్రోత్సవంలో ప్రదర్శించనున్నారు. ‘అన్ సర్టెన్ రిగార్డ్’ కేటగిరిలో ఈ సినిమాను స్క్రీనింగ్ చేయనున్నారు.
ప్రపంచవ్యాప్తంగా కళాత్మక విలువలతో రూపొందించిన చిత్రాలను ఈ విభాగంలో ప్రదర్శిస్తారు. మే 13 నుంచి 24 వరకు ఫ్రాన్స్ వేదికగా జరగనున్న 78వ కేన్స్ ఫిల్మ్‌ఫెస్టివల్‌లో ‘హోమ్‌బౌండ్’ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. దీంతో జాన్వీ ఇన్‌స్టా వేదికగా ఆనందం వ్యక్తం చేసింది. భారతీయ సినిమా ఖ్యాతిని ప్రపంచానికి తెలియజెప్పిన క్షణాలివని, ఇది తన బృందం మొత్తానికి దక్కిన గౌరవమని వ్యాఖ్యానించింది.
ఇదిలా ఉండగా.. జాన్వీ కపూర్‌కు బిర్లా వారసురాలు అనన్య బిర్లా సర్‌ప్రైజ్ గిఫ్ట్‌ను అందించారు. దాదాపు రూ.5 కోట్ల విలువైన లంబోర్ఘిని కారును ఆమెకు కానుకగా పంపించారు. అనన్య బ్యూటీ ప్రోడక్ట్స్ బ్రాండ్‌కు జాన్వీ కపూర్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నట్లు సమాచారం. తన బ్రాండ్ కోసం జాన్వీ సహకరిస్తున్నందుకు కానుకగా అనన్య ఈ ఖరీదైన లంబోర్ఘిని కారును జాన్వీకి బహుకరించారని టాక్.